News


రూ.40 వేలు దాటిన పసిడి...

Tuesday 27th August 2019
Markets_main1566877489.png-28031

  • సరికొత్త గరిష్టస్థాయి
  • అంతర్జాతీయంగా సానుకూలత
  • రూపాయి బలహీనత
  • వెరసి వెలుగుతున్న బంగారం

ముంబై: దేశంలో పసిడి కాంతులు చిందుతోంది. అంతర్జాతీయంగా పటిష్ట ధోరణి, దేశీయంగా రూపాయి బలహీనత వంటి అంశాలు పసిడికి కలిసివస్తున్నాయి. ముంబై స్పాట్‌ మార్కెట్‌లో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర రూ.40,100 వద్దకు చేరింది. ఇది సరికొత్త గరిష్టస్థాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.38,190గా ఉంది.  2011 సెప్టెంబర్‌లో ఔన్స్‌(31.1గ్రా)కు 1,920 డాలర్లను చూసిన పసిడి, మళ్లీ ఆ దిశగా నడుస్తోందా? అన్నట్లు పరిస్థితి కనబడుతోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, వాణిజ్య యుద్ధం, సెంట్రల్‌ బ్యాంకులుసైతం పసిడి కొనుగోళ్లు వంటి అంశాలు బంగానికి బలాన్ని ఇస్తున్నాయి. అంతర్జాతీయంగా పసిడి సోమవారం తాజా సరికొత్త స్థాయి 1,564.95 డాలర్లను చూసింది. ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయానికి అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో పసిడి 2 డాలర్లకుపైగా లాభంతో 1,540 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌- మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌- ఎంసీఎక్స్‌లో ధర 10 గ్రాములకు స్వల్ప లాభంతో రూ.38,903 వద్ద ట్రేడవుతోంది. గరిష్ట స్థాయి రూ. 39,340ని చూసింది. 



You may be interested

హైదరాబాద్‌లో వన్‌ ప్లస్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌

Tuesday 27th August 2019

మూడేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడి కంపెనీ ఫౌండర్‌, సీఈవో పీట్‌ లావ్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- ప్రీమియం మొబైల్‌ ఫోన్ల తయారీలో ఉన్న చైనా సంస్థ వన్‌ ప్లస్‌ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పింది. ఇక్కడి నానక్‌రామ్‌గూడలో 1,86,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫెసిలిటీని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ సోమవారం

అమెరికా నుంచి మరిన్ని దిగుమతుల యోచన

Tuesday 27th August 2019

- ట్రంప్‌తో ప్రధాని మోదీ బియారిట్జ్‌/లండన్:-   ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకునే దిశగా అమెరికా నుంచి దిగుమతులు మరింతగా పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే 4 బిలియన్ డాలర్ల విలువ చేసే దిగుమతులు తుది దశలో ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జీ7 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇరువురు భేటీ అయ్యారు. టారిఫ్‌లు, ఆర్థికాంశాలపై వివాదాలతో రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం

Most from this category