News


సావరిన్‌ గోల్డ్‌ బాండ్లా..!? గోల్డ్‌ ఈటీఎఫ్‌ లా..?

Saturday 14th September 2019
Markets_main1568457666.png-28380

మార్కెట్లో నెలకొన్న అనిశ్చితితో ఇన్వెస్టర్లు పసిడి పెట్టుబడుల వైపు పరుగులు తీస్తున్నారు. సాధారణంగా భౌతిక పసిడి ప్రత్యామ్నాయంగా సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు, గోల్డ్‌ ఎక్చ్సేంజీ ట్రేడెడ్‌ ఫండ్లు, గోల్డ్‌ ఫండ్లలో పెట్టవచ్చు. అయితే వీటిలో పెట్టుబడులకు కొన్ని ప్రయోజనాలతో పాటు మరికొన్ని పరిమితులున్నాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌, గోల్డ్‌ ఇండెక్స్‌ ఫండ్ల కంటే సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడులు ఉత్తమమని  ఫైనాన్షియల్‌ అడ్వైజరీస్‌ ఫౌండర్‌ సురేష్‌ సదాగోపన్‌ అభిప్రాయపడుతున్నారు. ‘‘ప్రసుత్త కాలంలో సావరిన్‌ గోల్డ్‌ బాండ్లలో పెట్టుబడి మంచింది. ఈ బాండ్లు అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ కాలపరిమితి 8 సంవత్సరాలు. ఏడాదికి రెండున్నర శాతం వడ్డీ రాబడి వస్తుంది. ఎనిమిదేళ్ల కాలపరిమితికి ముందే బాండ్ల నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. ఐదో సంవత్సరం నుంచి వడ్డీ చెల్లింపు దినాన బాండ్స్‌ నుంచి వైదొలగవచ్చు. అంతవరకు ఉంటే మూలధన లాభం(క్యాపిటల్‌ పన్ను)పై పన్ను ఉండదు. గోల్డ్‌ బాండ్లు, గోల్డ్‌ ఎక్చ్సేంజీ ట్రేడెడ్‌ ఫండ్లు, గోల్డ్‌ ఫండ్లలో పెట్టుబడులకు ఈ అవకాశం ఉండదు. పన్నుల పరంగా కూడా వీటివల్ల ఇబ్బంది ఉండదు.’’ అని సదాగోపన్‌ అభిప్రాయపడుతున్నారు.

తక్కువ డబ్బుతో సిప్‌ పద్దతిలో పసిడిలో పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు గోల్డ్‌ ఫండ్లు అయితే ఉత్తమమని విశాల్‌ ధోషి అంటున్నారు. సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు, గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో సదుపాయాలను ఫండ్లు ఇస్తున్నాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లతో కచ్చితమైన ధరకు కొనుగోలు చేయవచ్చు. సావరిన్‌ బాండ్లకు తగినంత లిక్విటిడీ లేదు. కానీ ఈటీఎఫ్‌లకు ఈ సమస్య ఉండదు. ఫిజికల్‌ గోల్డ్‌ చివరి ఆరునెలల కాలంలో 20-21శాతం ఆదాయాన్ని ఇచ్చాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు కూడా అంతే మొత్తం రాబడిని ఇన్వెస్టర్లకిచ్చాయి. 



You may be interested

నిఫ్టీ ముందుకా.. మళ్లీ వెనక్కా..?

Sunday 15th September 2019

నిఫ్టీ మరోసారి 11,000 మార్క్‌ పైకి చేరింది. 11,000 మార్క్‌పైన క్లోజవుతున్న సూచీ, ఆ తర్వాత ముందుకు ర్యాలీ చేయలేకపోతోంది. ఇలా మూడు సార్లు జరిగింది. దీంతో ఈ సారి కూడా సూచీ తిరిగి వెనక్కి వచ్చేస్తుందా..? అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే, గుడ్డిగా నిఫ్టీ ర్యాలీ వెంట పడొద్దని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌, అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ సూచిస్తున్నారు. ఆయన అభిప్రాయాలు

ఎగుమతులు, హౌసింగ్‌ రంగాలకు ఆర్థిక మంత్రి ఉద్దీపన

Saturday 14th September 2019

పడిపోయిన ఎగుమతుల్ని పునరుద్ధరించే క్రమంలో కొత్త స్కీమును ప్రవేశపెట్టడంతో పాటు, మధ్యాదాయ వర్గాల హౌసింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి ఆర్థికసాయం అందించేందుకు స్పెషల్‌ విండో ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. శనివారంనాడు న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఎగుమతులు, హౌసింగ్‌ రంగాలకు  పలు ఉద్దీపన చర్యల్ని మంత్రి వెల్లడించారు. ముఖ్యాంశాలు.... -ఎగుమతి ఉత్పత్తులపై సుంకం లేదా పన్నుల ఉపశమనం(ఆర్‌ఓడీటీఈపీ) అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నాం. ఇది జనవరి 1, 2020 నుంచి మర్చండీస్‌

Most from this category