News


వెండిలో ఇన్వెస్ట్‌ చేసే ఈటీఎఫ్‌లు ఆకర్షణీయం

Sunday 8th September 2019
Markets_main1567965196.png-28256

బంగారం ర్యాలీని వెండి కూడా అందుకుని పరుగులు తీస్తోంది. లండన్‌ మార్కెట్‌లో సిల్వర్‌ స్పాట్‌ ధరలు ఔన్స్‌కు 19.64 డాలర్లకు చేరి మూడేళ్ల గరిష్ట స్థాయికి వెళ్లాయి. 2013 అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయి ధరకు చేరడం మళ్లీ ఇదే. నిజానికి చారిత్రకంగా చూస్తే బంగారం ర్యాలీ చేసినప్పుడల్లా వెండి కూడా మంచి ప్రదర్శనే చూపుతోంది. ఈ నేపథ్యంలో వెండిలో ఇన్వె‍స్ట్‌ చేసే ఈటీఎఫ్‌లు పెట్టుబడులకు ఆకర్షణీయమని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కమోడిటీ రీసెర్చ్‌ హెడ్‌ హరీష్‌ వి తెలియజేశారు.

 

‘‘ఇటీవలి ర్యాలీలో బంగారం జూన్‌ నుంచి 20 శాతం పెరిగింది. వెండి మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో 37 శాతం ర్యాలీ చేసింది. దేశీయ మార్కెట్లోనూ ఇదే మాదిరి ధరల పెరుగుదల ఉంది. వెండి జూన్‌ నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. పారిశ్రామిక డిమాండ్‌ స్తబ్దుగా ఉండడం, మొత్తం మెటల్‌ విభాగంలో బేరిష్‌ సెంటిమెంట్‌ ఉండడం కారణం. అయితే, మన దేశంలో మాత్రం బలహీన రూపాయి కారణంగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితులతో బంగారం బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరగా, వెండిలోనూ ఇదే తరహా ర్యాలీ నెలకొంది. ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలను ఆశ్రయిస్తున్నారు. వాస్తవంగా బంగారంతో పోలిస్తే వెండిలో అస్థిరతలు ఎక్కువ. 

 

పలు సెంట్రల్‌ బ్యాంకులు విధాన రేట్లను సులభంగా మారుస్తుండడం మెటల్స్‌ బలాన్ని సంతరించుకుంటున్నాయి. అమెరికా ఫెడ్‌ ఇటీవలే వడ్డీ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. మరిన్ని రేట్ల కోతులు కూడా ఉంటాయని అంచనా. వడ్డీ రేట్ల కోతకు బంగారం, వెండి ధరలు చాలా సున్నితంగా స్పందిస్తాయి. ఉత్పత్తి తగ్గడం, జ్యుయలరీ రంగంలో డిమాండ్‌ పెరగడం ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది. ఇటీవలి వెండి ర్యాలీ కారణంగా బంగారం-వెండి ధరల మధ్య నిష్పత్తి తగ్గింది. ఔన్స్‌ బంగారం కొనేందుకు అవసరమైన వెండి జూలైలో 93గా ఉంటే, అది 81 శాతానికి తగ్గింది. అంటే బంగారంతో పోలిస్తే గత రెండు నెలలుగా వెండి మంచి పనితీరు చూపిస్తోంది. దీంతో సురక్షిత పెట్టుబడి వేదికగా, వెండిలో ఇన్వెస్ట్‌ చేసే ఈటీఎఫ్‌లు ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మారాయి. బంగారం వంటి ఇతర విలువైన లోహాలతో పోలిస్తే ఇందులో వ్యయాలు కూడా తక్కువే. వెండికి దేశీయ మార్కెట్ల తక్షణ నిరోధం 55,400 వద్ద ఉండగా, మద్దతు 43,000గా ఉంది.’’
 You may be interested

ఈ వారం టాప్‌-3 బెట్స్‌: కునాల్‌ బోత్రా

Sunday 8th September 2019

ఈ వారం నిఫ్టీ 11,200 వరకు ర్యాలీ చేయవచ్చన్న అంచనాను ప్రముఖ మార్కెట్‌ అనలిస్ట్‌ కునాల్‌ బోత్రా వ్యక్తం చేశారు. ఈ వారం ట్రేడింగ్‌ పరంగా అనుకూలంగా ఉండే మూడు స్టాక్స్‌ను కూడా ఆయన సూచించారు.    నిఫ్టీ గత వారం కనిష్ట స్థాయిల నుంచి 100-150 పాయింట్ల మేర రికవరీ అయిందని, మరీ ముఖ్యమైన అంశం.. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ తిరిగి పెరిగేందుకు ప్రయత్నించడమన్నారు. అలాగే, మార్కెట్‌ బ్రెడ్త్‌ (లాభ, నష్టపోయిన షేర్ల

మైక్రోఫైనాన్స్‌ రంగంలో ఎందుకు ఇన్వెస్ట్‌ చేయకూడదు?

Sunday 8th September 2019

పెద్ద కార్పొరేట్‌ సంస్థలు తమకున్న పేరు, ప్రఖ్యాతులు, బ్రాండ్‌ వ్యాల్యూతో రుణాలను సులభంగా పొందగల స్థితిలో ఉంటాయి. వారితో చేతులు కలిపేందుకు రుణాలిచ్చే సంస్థలు కూడా సంతోషంగానే ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన రుణాలను వెనక్కి పొందగలమన్న నమ్మకం వాటిది. దీనికి భిన్నంగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్‌) తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇచ్చేవి. పైగా ఇవి సులభంగా లభించేవి కావు. కానీ, వరుసగా కార్పొరేట్‌ సంస్థలు రుణాల

Most from this category