News


పుత్తడి బాండ్ల ఇష్యూ ధర.. రూ.3,835

Tuesday 22nd October 2019
Markets_main1571714766.png-29036

  • ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ.50 డిస్కౌంట్‌ 
  • ఈ నెల 25న ముగింపు 

న్యూఢిల్లీ:- పుత్తడి బాండ్ల ఆరో దఫా జారీని కేంద్రం సోమవారం ప్రారంభించింది. ధన్‌తేరస్‌ సందర్భంగా పుత్తడి కొనుగోళ్లు జోరుగా జరుగుతాయనే అంచనాలతో ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు (ఎస్‌జీబీ) జారీని కేంద్రం ప్రారంభించింది. ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20-సిరీస్‌ సిక్స్‌.... ధన్‌తేరస్‌ రోజునే (ఈ నెల25న) ముగుస్తుంది. ఈ స్కీమ్‌లో ఒక్కో గ్రామ్‌ ధరను రూ.3,835గా కేంద్రం నిర్ణయించింది.ఆన్‌లైన్‌ ద్వారా ఈ బాండ్లను కొనుగోలు చేసేవాళ్లకు రూ.50 డిస్కౌంట్‌ లభించనున్నది. 
సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2015, నవంబర్‌లో ఆరంభించింది. ఆభరణాలు, బిస్కెట్లు.. ఇలా భౌతిక రూపంలో బంగారం కొనుగోళ్లను తగ్గించి, దేశీయ పొదుపులను ఆర్థిక ఆదాలుగా మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తెచ్చింది. ఈ స్కీమ్‌లో భాగంగా ఒక్క గ్రామ్‌, అంతకు మించిన గ్రామ్‌ల డినామినేషన్లలో బాండ్లను జారీ చేస్తారు. కనిష్టంగా ఒక్క గ్రామ్‌ బాండ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఇన్వెస్టర్‌ గరిష్టంగా 500 గ్రాముల వరకూ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. You may be interested

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ లాభం రూ.964 కోట్లు

Tuesday 22nd October 2019

61 శాతం వృద్ధి  93,421కు చేరిన మొత్తం టవర్ల సంఖ్య  న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన మొబైల్‌ టవర్ల విభాగం,  భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో 61 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.600 కోట్లుగా ఉన్న బ్యాంక్‌ నికర లాభం ఈ క్యూ2లో రూ.964 కోట్లకు పెరిగిందని భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ తెలిపింది. ఆదాయం మాత్రం స్వల్పంగా తగ్గిందని కంపెనీ చైర్మన్‌

నేడు బ్యాంక్‌ సమ్మె

Tuesday 22nd October 2019

విలీనాలు, ఇతర అంశాలకు నిరసన  సమ్మె ప్రభావం స్వల్పమేనంటున్న ఎస్‌బీఐ  న్యూఢిల్లీ/కోల్‌కత:  బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా నేడు(మంగళవారం) కొన్ని బ్యాంక్‌ యూనియన్లు సమ్మె చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది. బ్యాంక్‌ల విలీనాలు, డిపాజిట్ల రేట్ల తగ్గింపు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలపై నిరసన తెలియజేస్తూ ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఈఎఫ్‌ఐ)లు క్‌ యూనియన్లు జాతీయ స్థాయిలో 24

Most from this category