News


రూపాయి.. చరిత్రాత్మక కనిష్టం

Friday 13th March 2020
Markets_main1584068013.png-32443

  • 82 పైసల నష్టంతో ఇంట్రాడేలో 74.50
  •  అటుపై రికవరీ... 74.24 వద్ద ముగింపు
  •  క్రితం ముగింపుతో పోల్చితే 56 పైసలు నష్టం

 ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి బలహీన ధోరణి కొనసాగుతోంది. గురువారం ఒకేరోజు 56 పైసలు పతనమయ్యింది. 74.24 వద్ద ముగిసింది. గడచిన 17 నెలల కనిష్ట స్థాయి ఇది. ఇంకా చెప్పాలంటే, రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టం ముగింపునకు (74.39) 15పైసలు దూరంలో ఉంది. నిజానికి గురువారం ట్రేడింగ్‌ ఒకదశలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయి- 74.50 పడింది. అటుపై 26పైసలు కోలుకుని 74.24 వద్ద ముగిసింది.  క్రూడ్‌ ధరల భారీ పెరుగుదల నేపథ్యంలో 2018 అక్టోబర్‌ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. నిజానికి అంతర్జాతీయ క్రూడ్‌ ధరల పతనం రూపాయి విలువకు సానుకూలం కావాల్సి ఉంది. అయితే చైనా కరోనా వైరస్‌ భయాలు, మొత్తంగా ప్రపంచ వృద్ధిపై   కోవిడ్‌-19 ప్రభావం పడుతుందన్న భయాలు, తాజా అమెరికా ట్రావెల్‌ బ్యాన్‌,  ఈక్విటీ మార్కెట్ల బలహీనత, సురక్షిత సాధనంగా డాలర్‌కు డిమాండ్‌  తత్సంబంధ అంశాలు రూపాయి తాజా పతనానికి కారణం అవుతుండడం గమనార్హం. బుధవారం రూపాయి ముగింపు 73.68. ట్రేడింగ్‌ ప్రారంభంతోనే భారీ నష్టంతో 74.25 వద్ద ప్రారంభమైంది. 

ఆర్‌బీఐ డాలర్ల పంప్‌...
కాగా దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లలో డాలర్లకు డిమాండ్‌, భారీగా బలహీనపడుతున్న రూపాయి నేపథ్యంలో... రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రంగంలోకి దిగుతోంది. సోమవారం రెండు బిలియన్‌ అమెరికా డాలర్లను బ్యాంకులకు విక్రయించనుంది. వ్యవస్థలో లిక్విడిటీ పెంపు లక్ష్యంగా ఈ చర్యకు దిగుతోంది. 2020 మార్చి 6 నాటికి భారత్‌ వద్ద 487.24 బిలియన్‌ డాలర్ల రికార్డుస్థాయి విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి తగిన స్థాయిలో ఈ నిధులు ఉన్నట్లు ఆర్‌బీఐ వర్గాలు పేర్కొన్నాయి.  
 



You may be interested

మాంద్యంలోకి వెళ్లిపోయాం

Friday 13th March 2020

భారత్‌ కూడా ఇందులో భాగమే మార్క్‌ మొబియస్‌ అభిప్రాయం న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లడం ఖాయమేనని వర్ధమాన మార్కెట్ల ఫండ్‌ మేనేజర్‌, మార్క్‌ మొబియస్‌ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ మొబియస్‌ అన్నారు. ‘‘మనకు మాంద్యం రాబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సాంకేతికంగా చెప్పాలంటే భారత్‌ సహా ప్రపంచంలో అధిక భాగం మాంద్యంలోనే ఉంది. అలా అని మనం చేతులు పైకెత్తేసి ఓటమిపాలైనట్టు కాదు. ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది.

స్టాక్స్‌ బేర్‌ మార్కెట్లోకి వెళితే ఏం జరుగుతుంది?

Friday 13th March 2020

దేశీయ ఈక్విటీ మార్కెట్లు కీలక మద్దతు స్థాయిలను కోల్పోవడంతోపాటు గురువారం నాటి ట్రేడింగ్‌ సెషన్‌లో బేర్‌ మార్కెట్లోకి అడుగు పెట్టేశాయి. నిఫ్టీ50 సూచీ రెండున్నర సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగిపోయింది. మార్కెట్లలో కరెక్షన్‌ వేరు, బేర్‌ మార్కెట్‌ వేరు. రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది.   చాలా మంది ఇన్వెస్టర్లకు కరెక్షన్‌, బేర్‌ మార్కెట్‌ రెండూ ఒకటే అని భావిస్తుంటారు.  రెండూ కూడా మార్కెట్‌ పతనాలే. కాకపోతే తీవ్రత వేరు. ప్రధాన సూచీలు

Most from this category