రూపాయి... రెండు వారాల గరిష్టం @71.50
By Sakshi

ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం రెండు వారాల గరిష్టం 71.50 స్థాయికి చేరింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 24 పైసలు బలపడింది. అక్టోబర్ 17 తరువాత రూపాయి ఒకేరోజు 24 పైసలు బలపడ్డం ఇదే తొలిసారి. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ట్రేడింగ్‌లో 71.49-71.68 శ్రేణిలో తిరిగింది. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత పలు సానుకూల అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. చమురు ధర పెరుగుదల భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం.
You may be interested
నిధుల సమీకరణ..యస్ బ్యాంక్ 5% అప్
Wednesday 27th November 2019నిధుల సమీకరణ కోసం యస్ బ్యాంక్ బోర్డు డైరక్టర్లు శుక్రవారం సమావేశం కానున్నారు. కొత్తగా ఈక్విటీల ఇష్యు చేసి నిధులను సమీకరించాలని బ్యాంక్ బోర్డు భావిస్తోంది. కాగా గతంలో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడుల కోసం అంతర్జాతీయ ఇన్వెస్టర్ నుంచి బైండింగ్ ఆఫర్ వచ్చిందని బ్యాంక్ యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. యస్ బ్యాంక్ నిధుల సమీకరణ గురించి వార్తలు వెలువడడంతో ఈ బ్యాంక్ షేరు బుధవారం సెషన్లో 5.05
గ్యాప్‌అప్ ఓపెనింగ్
Wednesday 27th November 2019క్రితం రోజు కొత్త రికార్డులు నెలకొల్పిన తర్వాత లాభాల స్వీకరణకు గురైన స్టాక్ సూచీలు బుధవారం తిరిగి గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 40,979 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 30 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,069 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి.