STOCKS

News


గోల్డ్‌పై రిటర్న్‌లను అంచనావేయొచ్చు: డబ్యూజీసీ

Wednesday 21st August 2019
Markets_main1566374098.png-27920

వడ్డీ రేట్లు ప్రతికూలంగా మారడంతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక మార్కెట్లు అనిశ్చితిలో ఉండడంతో గత 10 నెలల నుంచి బంగారం, ఇతర ప్రధాన ఆస్తుల కంటే సురక్షితంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ యుఎస్(డబ్యూజీసీ), మేనేజింగ్ డైరెక్టర్ జోసెఫ్ కావటోని అన్నారు. బంగారం ధర ఈ పదినెలలో దాదాపు 25 శాతం పెరిగిందని తెలిపారు. ‘అభివృద్ధి చెందిన మార్కెట్లలో, 70 శాతం పైగా మార్కెట్లలో వడ్డీరేట్లు ప్రతికూలంగా ఉన్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు రిటర్నులిచ్చే ఆస్తుల కోసం వెతుకుతున్నారు’ అని వివరించారు.    
   ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, గత ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగిందని,  ఇది ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 1,123 టన్నులకు చేరుకుందని జోసెఫ్ కావటోని అన్నారు. అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు, ఇన్వెస్టర్లు ఇతర ఆస్తులపై రిటర్నలను అంచనా వేయలేకపోతుండడం వంటి కారణాల వలన వచ్చే ఏడాదిలో కూడా ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ స్థాయి పెరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ పరిణామాలను వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పర్యవేక్షిస్తోందని ఆయన వివరించారు. ‘యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల ప్రభావాన్ని గమనిస్తున్నాం. దీనితోపాటు బంగారం డిమాండ్‌లో దాదాపు 50 శాతం భారతదేశం, చైనా నుంచి వస్తుంది. కనుక ఈ రెండు దేశాల పరిస్థితులను కూడా గమనిస్తున్నాం’ అని అన్నారు. ఫలితంగా బంగారాన్ని ప్రపంచ ఆస్తిగా పరిగణించాలని తెలిపారు. డబ్యూజీసీ ఇండియాలో ‘ఇండియా స్పాట్ గోల్డ్ ఎక్స్ఛేంజ్’ ఏర్పాటు చేయడం కోసం బ్లూప్రింట్‌ను విడుదల చేసింది. కాగా ఈ ఎక్సేంజ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా 27 మంది సహచరులతో కలిసి పనిచేస్తోంది. బంగారం ధరలను అర్థం చేసుకోడానికి, పారదర్శక మార్కెట్‌ను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని జోసెఫ్ కావటోని తెలిపారు.You may be interested

కరుగుతున్న మెటల్‌ షేర్లు

Wednesday 21st August 2019

2.50 శాతం క్షీణించిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మార్కెట్‌ పతనంలో భాగంగా మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3శాతం క్షీణించింది. నేడు ఇండెక్స్‌ 2,340.35 వద్ద ప్రారంభమైంది. ట్రేడ్‌వార్‌ కారణంగా చైనాలో మెటల్‌ నిల్వలు పెరగడటం, ధరలు క్షీణించడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇదే ట్రెండ్‌ దీర్ఘకాలం పాటు కొనసాగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మైనింగ్‌ దిగ్గజం

నిఫ్టీ వృద్ధి అంచనాలు తగ్గించిన గ్లోబల్‌ బ్రోకరేజ్‌లు

Wednesday 21st August 2019

ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు అనేకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిఫ్టీ ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గించాయి. దీంతో పాటు ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం ఈ సంస్థలు కట్‌చేశాయి. క్యు1లో అంచనాలకన్నా తక్కువగా ఎర్నింగ్స్‌ ఉండడంతో బ్రోకరేజ్‌లు ఈ నిర్ణయానికి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిఫీ​వృద్ధి అంచనాలు 31 నుంచి 25 శాతానికి పతనం కావచ్చని, వచ్చే ఏడాదికి ఈ అంచనా 22 శాతం ఉండొచ్చని క్రెడిట్‌ సూసీ తన

Most from this category