News


ఇక రోజంతా రూపీ ట్రేడింగ్‌

Wednesday 8th January 2020
Markets_main1578454465.png-30745

  • బ్యాంకులకు ఆర్‌బీఐ గ్రీన్‌సిగ్నల్‌
  • ఎక్స్చేంజీల్లోనూ వేళలు పొడిగించే అవకాశం


ముంబై: దేశీయంగా రూపాయి ట్రేడింగ్‌ సేవలు ఇకపై 24 గంటలూ అందుబాటులో ఉండేలా రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రోజంతా దేశీ కరెన్సీ ట్రేడింగ్‌ సేవలు అందించడానికి దేశీ బ్యాంకులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రూపాయి ట్రేడింగ్‌ పరిమాణం భారత్‌లో కన్నా విదేశాల్లో గణనీయంగా జరుగుతుండటం, ఇక్కడ ట్రేడింగ్‌ వేళలు పరిమితంగా ఉండటం వల్ల అంతర్జాతీయ పరిణామాలను దేశీ మార్కెట్లు వెంటనే అందిపుచ్చుకోలేక ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశీ మార్కెట్‌ వేళల తర్వాత కూడా అధీకృత డీలర్లు ఇంటర్‌–బ్యాంక్‌ లావాదేవీలను నిర్వహించవచ్చని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆర్‌బీఐ ఆదేశాలు ఓవర్‌-ది-కౌంటర్‌ మార్కెట్‌ లావాదేవీలకే పరిమితమైనా.. అటు ఎక్స్చేంజీల్లో కూడా కరెన్సీ ట్రేడింగ్‌ వేళలను పొడిగించేందుకు బాటలు వేసే అవకాశముంది. అయితే, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. 
చాన్నాళ్లుగా డిమాండ్‌...
వాస్తవానికి కరెన్సీ ట్రేడింగ్‌ వేళలు పొడిగించాలన్న డిమాండ్‌ చాన్నాళ్లుగానే ఉంది. దేశీయంగా కన్నా ఇతరత్రా కొన్ని దేశాల్లో రూపాయి ట్రేడింగ్‌ భారీగా ఉంటుండటమే ఇందుకు కారణం. స్పాట్‌ లావాదేవీలు, ఫారిన్‌ ఎక్సే‍్ఛంజీ మార్పిడి, ఆప్షన్లు తదితర విధానాల్లో జరిగిన రూపాయి ట్రేడింగ్‌కు సంబంధించి 2019 సెప్టెంబర్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్మెంట్స్‌ విడుదల చేసిన గణాంకాలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం సగటున రోజువారీ రూపాయి ట్రేడింగ్‌ పరిమాణం భారత్‌లో 34.49 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అయితే, బ్రిటన్‌లో దీనికన్నా అధికంగా 46.82 బిలియన్‌ డాలర్ల స్థాయిలో నమోదైంది. ఇక అమెరికాలో 14.40 బిలియన్‌ డాలర్లుగాను, హాంకాంగ్‌లో 12.57 బిలియన్‌ డాలర్లుగాను ఉంటోంది. ఈ నేపథ్యంలోనే రూపాయి ట్రేడింగ్‌ విషయంలో ఆర్‌బీఐ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 



You may be interested

చమురు చిక్కులకు.. డాలర్లతో చెక్‌!

Wednesday 8th January 2020

ప్రస్తుతం ఫారెక్స్‌ నిల్వలు 457.5 బిలియన్‌ డాలర్లు 2019లో ఒకే ఏడాది 64 బిలియన్‌ డాలర్ల పెరుగుదల ప్రస్తుత నిధులతో 10 నెలల దిగుమతి అవసరాలు ఓకే అంతర్జాతీయ అనిశ్చితికి డాలర్ల రక్షణ ఆసియాలో అధికంగా డాలర్లను కొన్నది ఆర్‌బీఐనే డాలర్ల సమీకరణలో భారత్‌ తర్వాత కొరియా, తైవాన్‌ చమురు నిల్వల ప్రధాన కేంద్రం పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్‌ ప్రతీకార చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇటీవలి కాలంలో ఉన్న ధరలతో చూస్తే బ్యారెల్‌కు 5

బెంగళూరును దాటేసిన భాగ్యనగరం!

Wednesday 8th January 2020

ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ టాప్‌ హెచ్‌2లో 89 లక్షల చ.అ. లావాదేవీలు; 7,933 గృహాల విక్రయం నైట్‌ఫ్రాంక్‌ ఇండియా 12వ నివేదికలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ క్రయవిక్రయాలు టాప్‌ గేర్‌లో సాగుతున్నాయి. 2019 జులై – డిసెంబర్‌ (హెచ్‌2) మధ్య కాలంలో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే భాగ్యనగరంలోనే అత్యధిక లావాదేవీలు జరిగాయి. గతేడాది హెచ్‌2లో బెంగళూరులో 70 లక్షల చ.అ.కు సంబంధించిన లావాదేవీలు జరగ్గా..

Most from this category