News


పెరిగి..పడిన పసిడి

Friday 15th November 2019
Markets_main1573796692.png-29614

క్రితం రాత్రి అమెరికా మార్కెట్లో 10డాలర్లు లాభపడిన పసిడి ఫ్యూచర్లలో నేటి ఉదయం లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 7.05 డాలర్లు నష్టపోయి 1,466.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి  అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలు మరోసారి తెరపైకి రావడం తదితర కారణాలతో పసిడి ధర 10డాలర్లు పెరిగి 1,473  డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1,471.75 డాలర్ల ప్రారంభమైంది. చైనాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి అమెరికా సుముఖంగా ఉందని వైట్ హౌస్ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఈక్విటీల్లోకి తరలించడంతో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గింది. అలాగే పసిడి నిన్నరాత్రి 10డాలర్లు లాభపడి నేపథ్యంలో ట్రేడర్ల లాభాల స్వీకరణతో పసిడి మళ్లీ నష్టాల్లోకి మళ్లింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి పసిడి ధర 14శాతం నష్టపోయింది. 
దేశీయంగానూ లాభాల స్వీకరణే:- 
దేశీయంగానూ పసిడిలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.  ఎంసీఎక్స్‌లో నిన్న 10గ్రాముల పసిడి ధర రూ.169లు లాభపడి రూ.38266 వద్ద స్థిరపడింది. నేడు రూ.38,236.00 వద్ద ప్రారంభమైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండటం, ఈక్విటీలకు కొనుగోళ్లకు మద్దతు లభించడం తదితర కారణాలతో పసిడి ధర రూ.250లు వరకు నష్టపోయి రూ.38,016.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:30ని.లకు క్రితం ముగింపు (రూ.38266)తో పోలిస్తే రూ.238.00లు క్షీణించి రూ.38028.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


నిన్నటి(14-11-2019) పసిడి(24 క్యారెట్లు) ముగింపు ధర కోసం ఆయా నగరాల గుర్తుపై క్లిక్‌ చేయండి(స్పాట్‌ ధర)


 



You may be interested

అక్టోబర్‌లో ఫంద్స్‌ కొన్న బ్లూచిప్స్‌ ఇవే!

Friday 15th November 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ అక్టోబర్‌ నెలలో బ్లూచిప్‌ స్టాక్స్‌ కొనుగోలు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. వీటి వాల్యుయేషన్‌లు చౌకగా లేనప్పటికి, ఈ కంపెనీల వృద్ధి ఆశాజనకంగా ఉండడమే దీనికి కారణం. ఈ బ్లూచిప్‌ కంపెనీలన్ని ఒక పోలికను కలిగివున్నాయి. ఈ కంపెనీలు ఆయా రంగాలలో కీలకంగా ఉండడం లేదా కీలకంగా మారడానికి దగ్గర్లో ఉండడం గమనార్హం. ఫండ్‌ మేనేజర్లు అక్టోబర్‌ నెలలో కొనుగోలు చేసిన కంపెనీలలో టాప్‌ కంపెనీల గురించి

వొడాఫోన్‌ ఐడియా బాండ్స్‌తో ఎంఎఫ్‌లకు చిక్కులు!?

Friday 15th November 2019

వెన్నాడుతున్న డౌన్‌గ్రేడ్‌ భయాలు వొడాఫోన్‌ ఐడియా గతంలో జారీ చేసిన బాండ్స్‌ కొనుగోలు చేసిన డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నాయి. కంపెనీ విత్త పరిస్థితి బాగా దెబ్బతినడం, సాయం అందించేందుకు మాతృసంస్థలు విముఖత చూపడం తదితర కారణాలతో అసలు కంపెనీ మనుగడపైనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వ సాయం అందకపోతే కంపెనీ దివాలాకు సిద్ధమన్నట్లుగా ఉంది. దీంతో ఈ కంపెనీ సెక్యూరిటీలు హోల్డ్‌ చేస్తున్న ఎంఎఫ్‌లు ఎటూపాలు పోని

Most from this category