News


పసిడిలో లాభాల స్వీకరణ

Wednesday 28th August 2019
Markets_main1566972065.png-28070

ప్రపంచ ఆర్థిక మాంద్య భయాలతో కిత్రం ట్రేడింగ్‌లో ఆరేళ్ల గరిష్ట ధరపై ట్రేడైన పసిడి ధర బుధవారం స్వల్పంగా నష్టపోయింది. ఆరేళ్ల గరిష్టం వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం ఇందుకు కారణమైంది. చైనా-అమెరికాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, అమెరికా రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలతో పసిడి ధర ఇప్పటికీ ఆరేళ్ల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 6డాలర్ల క్షీణతతో 1,545.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది దిద్దుబాటు చర్య. కీలకమైన 1535 నిరోధ స్థాయిని అధిగమిచడంతో పాటు ఆ స్థాయిపై ముగిసింది. కాబట్టి సాంకేతికంగా 1,535 స్థాయిని తిరిగి పరీక్షీస్తున్న నేపథ్యంలో కొంత నష్టపోవడం సహజమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ 0.1శాతం పుంజుకోవడం సైతం పసిడిపై కొంత ఒత్తిడి కలుగుతోంది. నిన్నరాత్రి వెలువడిన అమెరికా ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరచడటం,  వాణిజ్య వివాద భయాలతో అక్కడి మార్కెట్లో పసిడి ధర 1శాతానికి పైగా లాభపడి అక్కడి మార్కెట్లో పసిడి ధర 1,551.80 డాలర్ల వద్ద ముగిసింది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు ఆశించినస్థాయిలో లేవు. రానున్న రోజుల్లో ఆర్థిక మాంద్య భయం రావచ్చు లేదా పూర్తిగా క్షీణించవచ్చు. ఈ నేపథ్యంలో ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపు కచ్చితంగా ఉండవచ్చు. అలాగే అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. ఈ అంశాలన్ని రానున్న రోజుల్లో పసిడి ర్యాలీకి అనుకూలిస్తాయని అని  నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంకు జాన్ శర్మ అన్నారు
దేశీయంగా రూ.100 నష్టం:- 
దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లోనూ పసిడి ధర స్వల్పంగా నష్టపోయింది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంటాక్డు 10గ్రాముల పసిడి ధర క్రితం గతవారం ముగింపు ధర(రూ.39044)తో పోలిస్తే రూ.119.00 ల స్వల్ప నష్టంతో రూ. 38925.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Wednesday 28th August 2019

నష్టాల మార్కెట్లోనూ రియల్టీ షేర్ల ర్యాలీ కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 2.50శాతం ర్యాలీ చేసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఒబేరాయ్‌ రియల్టీ ఇండెక్స్‌ 6శాతం ర్యాలీ చేసింది. కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సోదాలను పూర్తి చేసింది. గత కొద్దిరోజులుగా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోందని, అధికారులు లేవనెత్తిన అంశాలన్నింటికి పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు సంపూర్ణ

నష్టాల్లో జిందాల్‌, వేదంతా, హిందల్కో

Wednesday 28th August 2019

యుఎస్‌-చైనా ఒప్పందం గురించి మాట్లాడడానికి యుఎస్‌ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫోన్‌ కాల్స్‌ చైనా ప్రభుత్వానికి రాలేదని, యుఎస్‌ ఇలాంటి తప్పుడు చర్యలను ఆపి, చర్చలకు ఉపకరించే పరిస్థితిని తీసుకురావలని చైనా వైస్ ప్రీమియర్ లియు హి అన్నారు. ఫలితంగా ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో దేశియ మార్కెట్లు కూడా నెగిటివ్‌లో ఉన్నాయి. ఉదయం 10.43 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌

Most from this category