గరిష్టస్థాయిల వద్ద పసిడిలో లాభాల స్వీకరణ
By Sakshi

కిత్రం ట్రేడింగ్ సెషన్లో గరిష్టస్థాయిని అందుకున్న పసిడి ఫ్యూచర్లో లాభాల స్వీకరణ చేటుచేసుకుంది. హాంగ్‌కాంగ్ ఉద్రికత్తలు, అర్జెంటీనా రాజకీయ సంక్షోభం, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుండటం తదితర కారణాలో నిన్నటి ట్రేడింగ్‌లో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1,546 డాలర్ల వద్ద గరిష్టస్థాయిని తాకింది. అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైట్జైజర్, ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మునుచిన్లు చైనా వైస్ ప్రీమియర్ లియు హితో వాణిజ్య చర్చలు జరిపినట్లు ప్రకటించారు. పసిడి ట్రేడర్లు ఈ అంశాన్ని వాణిజ్య యుద్ధ ముగింపునకు అనుకూలమైనదిగానూ, చర్చలు నుంచి సానుకూల వార్తలు వచ్చే అవకాశం ఉండవచ్చని భావించారు. అలాగే పసిడి ధరలు గరిష్టస్థాయి వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో లాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా పసిడి ధర నిన్నటి ట్రేడింగ్‌లో గరిష్టస్థాయి(1,546డాలర్ల) నుంచి 32 డాలర్లు పతనమైన 1,514 వద్ద స్థిరపడింది. ఇక నేడు ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో 4డాలర్ల స్వల్ప పతనంతో 1,510 వద్ద ట్రేడ్ అవుతోంది.
దేశీయంగా మళ్లీ రూ.38000 దిగువకు:-
దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి ధరలు తిరిగి రూ.38000 దిగువకు చేరుకున్నాయి. నిన్నటి ట్రేడింగ్‌లో దేశీయంగానూ గరిష్టస్థాయి వద్ద పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణ జరగడం, అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణమయ్యాయి. ఫలితంగా నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్లో అక్టోబర్ కాంట్రాక్టు 10గ్రామల పసిడి ధర రూ.466(1.22శాతం) నష్టపోయి రూ.37775 వద్ద స్థిరపడింది. ఇక నేడు పసిడి ధర రూ.37,788.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ భారీగా రివకరీ కావడంతో పాటు ఈక్విటీ మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో పసిడి ధర రూ.10లు స్వల్ప నష్టంతో రూ.37765.00 వద్ద ట్రేడ్ అవుతోంది.
You may be interested
తగ్గిన ద్రవ్యోల్బణం..బలపడిన రూపీ
Wednesday 14th August 2019ఇంధన ధరలు తగ్గడంతో జులై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గి 3.15 శాతంగా నమోదయ్యింది. ఫలితంగా రూపీ డాలర్ మారకంలో 47 పైసలు బలపడి బుధవారం ట్రేడింగ్‌లో 70.93 వద్ద ప్రారంభమైంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడంతో అక్టోబర్‌లో ఆర్బీఐ ఇంకోసారి వడ్డీ రేట్లను తగ్గించడానికి వీలు కలుగుతుందని విశ్లేషకులు తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2019 జూన్‌లో 3.18 శాతంగా ఉండగా, గత ఏడాది (జూలై 2018) ఇదే కాలంలో ఇది
ఆర్థిక వ్యవస్థకు ఉద్ధీపనం!
Wednesday 14th August 2019ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి బయటపడేసేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. . కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరిశ్రమలకు ఉద్దీపన ప్యాకేజీలను సిద్ధంచేస్తున్నారని అన్నారు. ఇందులో పన్నులను తగ్గించడం, సబ్సీడీలివ్వడం, ఇతర ప్రోత్సాహాకాలందించడం వంటి పరిశ్రమల వృద్ధికి సంబంధించిన చర్యలే కాకుండా వ్యాపారాలను సులభతరం చేసుకునే విధంగా పలు చర్యలు తీసుకోనున్నారని వివరించారు. నిజాయితీగా పన్నులను చెల్లించే వాళ్లను వేధించకుండా, చిన్న లేదా