News


పసిడిలో స్వల్ప లాభాల స్వీకరణ

Thursday 8th August 2019
Markets_main1565239708.png-27621

ప్రపంచ మార్కెట్లో గరిష్ట స్థాయిల వద్ద పసిడి ఫ్యూచర్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో 16డాలర్లు నష్టపోయింది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కారణంగా అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 35.40 డాలర్లు లాభపడి 1,519.60 వద్ద స్థిరపడింది. ఈ నేపథ్యంలో నేడు ఆసియాలో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడంతో 16డాలర్లు మేర క్షీణించి 1,503.75 డాలర్ల కనిష్టస్థాయికి పతనమైంది. ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 6.75 డాలర్ల నష్టంతో 151.75డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాల మధ్య రోజురోజూకు తీవ్రతరమవుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, అంతర్జాయ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, పలు ప్రపంచదేశాల రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లపై మెతక వైఖరి తదితర అంశాలు పసిడి ధర నిన్నటి ట్రేడింగ్‌లో ఆరేళ్ల అనంతరం పసడి ధర 1500డాలర్ల స్థాయిని అందుకుంది. రాత్రి అమెరికా మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసే సరికి 2శాతం లాభంతో 1,519.60 డాలర్ల వద్ద స్థిరపడింది.
దేశీయంగానూ అదే ధోరణి:- 
దేశీయంగా పసిడి ధరలు జీవితకాల గరిష్టాన్ని అందుకున్న తరుణంలో లాభాల స్వీకరణ జరుగుతోంది. నేడు ఎంసీఎక్స్‌ మార్కెట్లో అక్టోబర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.200.00లు నష్టపోయి రూ.38019.00ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అగ్రరాజ్యాలైన చైనా, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడం, డాలర్‌ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌, ఈక్విటీ మార్కెట్ల వరసగ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా పసిడి ఫ్యూచర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా దేశీయంగా పసిడి ధరలు తొలిసారి రూ.38000ల స్థాయికి అందుకున్నాయి. ఇది పసిడి ధరకు జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఈ వారంలో కేవలం మూడు ట్రేడింగ్‌ సెషన్స్‌లో అక్టోబర్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ఫ్యూచర్‌ ధర ఏకంగా రూ. 1807లు లాభపడింది. నిన్నటి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి ధర రూ.721లు లాభంతో రూ.38,218 వద్ద స్థిరపడింది.



You may be interested

ఫలితాల ప్రభావం..నష్టాల్లో టాటా స్టీల్‌

Thursday 8th August 2019

ఆర్థిక సంవత్సరం 2020 మొదటి త్రైమాసికంలో టాటా స్టీల్‌ ఆదాయ వృద్ధి పడిపోవడంతో పాటు, నికర లాభం 64.3 శాతం క్షీణించి రూ. 693 కోట్లుగా నమోదు కావడంతో ఈ కంపెనీ షేరు విలువ గురువారం నష్టాల్లో ట్రేడవుతోంది. క్యూ1 ఫలితాలతో పాటు, సీఎల్‌ఎస్‌ఏ బ్రోకరేజి సంస్థ ఈ కంపెనీ స్టాకుపై ‘సెల్‌’ కాల్‌ను కొనసాగిస్తు, టార్గెట్‌ ధరను రూ. 395 నుంచి రూ.320 తగ్గించడం కూడా ఈ షేరుపై

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 8th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు భాష్‌:- అనవసరమైన నిల్వలను తొలగించేందుకు రెండు యూనిట్లలో 13రోజుల పాటు ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది మారుతి సుజుకీ ఇండియా:- వరుసగా ఆరోనెలలో ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ జూలైలో మొత్తం 1.33లక్షల యూనిట్లను ఉత్పత్తులు చేసింది. గతేడాది ఇదే జూలైలో జరిగిన 1.75లక్షల ఉత్పత్తులతో పోలిస్తే ఇది 25శాతం తక్కువ. వ్యయ నియంత్రణలో ఉత్పత్తులను తగ్గించుకున్నట్లు కంపెనీ తెలిపింది. గుజరాత్‌ అల్కేస్‌:- భారీ

Most from this category