పసిడిలో పెట్టుబడులా? ఈ అంశాలు చూడండి
By Sakshi

రానున్న ఏడాది కాలంలో మూడు అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమోడిటీ హెడ్ హరీష్ తెలిపారు. ఆయన కాలమ్ ద్వారా వ్యక్తపర్చిన అభిప్రాయాలిలా వున్నాయి.....
గత ఏడాది ద్వితియార్ధం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే బంగారం ధరలు 30 శాతానికి పైగా లాభపడ్డాయి. దీనిని బట్టి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంతో పాటు, బ్రెగ్జిట్ (యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం) ఆందోళనలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల వలన రిస్క్ ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు విముఖంగా ఉన్నారు. ఫలితంగా రక్షణాత్మకమైన బంగారం వంటి మెటల్స్‌లో పెట్టుబడులు పెరిగాయి. సెప్టెంబర్ మొదటి వారంలో బంగారం ధరలు ఆరేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. అయినప్పటికి గరిష్ఠ స్థాయిల నుంచి 5 శాతం మేర దిద్దుబాటు జరిగింది. వచ్చే ఏడాది కాలంలో బంగారం ఏ విధంగా కదులుతుందోనని ఇన్వెస్టర్లు అంచనావేయడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఏడాది కాలంలో బంగారం ధరలను యుఎస్-చైనా వాణిజ్య ఒప్పందం, బ్రెగ్జిట్, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ప్రభావితం చేయనున్నాయి.
ట్రేడ్‌వార్..
దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుఎస్-చైనా ట్రేడ్‌వార్ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. ట్రేడ్‌వార్ వలన అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం భయాలు పెరిగాయి. ఐఎంఎఫ్ అంతర్జాతీ ఆర్థిక వృద్ధి అంచనాలను ఈ ఏడాది, వచ్చే ఏడాదికిగాను తగ్గించింది. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుండడంతో రిస్క్ ఆస్తులకు డిమాండ్ తగ్గి, బంగారం వంటి రక్షణాత్మక ఆస్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ట్రేడ్‌వార్ ప్రభావాన్ని తమ ఆర్థిక వ్యవస్థలపై తగ్గించుకునేందుకు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాయి. దీంతో ఈల్డ్ ఆస్తులకు డిమాండ్ తగ్గి, బంగారం వంటి ఆస్తులపై డిమాండ్ గరిష్ఠ స్థాయిలకు చేరింది. ప్రస్తుతం యుఎస్-చైనా ట్రేడ్‌వార్ సరళతరమవుతుండడం వలన రిస్క్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తీసుకుంటున్న ఆర్థిక చర్యల వలన కూడా ఈ ట్రెండ్ బలపడుతోంది.
బ్రెగ్జిట్..
గత మూడున్నరేళ్ల నుంచి కొనసాగుతున్న బ్రెగ్జిట్ ఆందోళనల వలన యురోపియన్ దేశాలలో ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పెరుగుతోంది. ఫలితంగా కొత్తగా వచ్చే పెట్టుబడులు, వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఈ అనిశ్చితి పరిస్థితుల వలన ఈ ప్రాంతంలో వ్యాపార పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రిస్క్ ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధ పడడం లేదు. అయినప్పటికి బ్రెగ్జిట్ ఒప్పందం క్రమబద్ధంగా జరిగితే, ఈ ప్రాంతంలోని రాజకీయ, ఆర్థిక అనిశ్చితిలు స్వల్పకాలంలో తొలగిపోతాయి. కానీ ఈ ఒప్పందం ఇంకొంత కాలం కొనసాగితే బంగారం మరింత పెరుగుతుంది.
అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు..
వీటితో పాటు అంతర్జాతీయంగా రాజకీయ ఆందోళనలు పెరుగుతుండడం కూడా బంగారం ధరలకు మద్ధతుగా ఉంది. మధ్య ప్రాచ్య ఒత్తిళ్లు, కొరియా ద్వీపంలో అనిశ్చితి వంటి అంశాలు అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులను అధ్వాన్నంగా మారుస్తున్నాయి. నార్తన్ సిరియాలో టర్కీ సైనిక చర్య, హాంగ్‌కాంగ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వంటి అంశాలు ఇన్వెస్టర్లు బంగారానికి ఆకర్షితులు కావడానికి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితులు సరళతరమయితే, ఇన్వెస్టర్లు తమ సంపదను ఇతర ఆస్తులలో ఇన్వెస్ట్ చేస్తారు.
యుఎస్-చైనా వాణిజ్య వివాదం, అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు కొనసాగినంత కాలం బంగారంపై పాజిటివ్ దృక్పథం కొనసాగుతుంది. డాలర్లో అనిశ్చితి, కేంద్ర బ్యాంకులు తీసుకునే చర్యలపై ఆందోళనలు వంటి అంశాలు కూడా బంగారం సెంటిమెంట్‌ను గరిష్ఠ స్థాయిల వద్ద ఉంచుతాయి. వచ్చే నెలలో జరగనున్న యుఎస్-చైనా వాణిజ్య చర్చలు కీలకంగా ఉన్నాయి. ఈ చర్చలలో సానుకూల ఫలితం వస్తే బంగారం డిమాండ్ తగ్గుముఖం పడుతుంది. దీంతోపాటు బ్రెగ్జిట్ క్రమబద్ధంగా జరిగిన అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిలు సరళతరమవుతాయి.
దేశీయ కారణాలు..
దేశీయంగా సెప్టెంబర్ మొదటి వారంలో బంగారం ధరలు అల్‌టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతోపాటు, రూపీ బలహీనత వలన బంగారం ధరలు ఎగిశాయి. ముందుకు వెళ్లే కొద్ది.. అస్థిరంగా ఉన్న ఈక్విటీ మార్కెట్లు, బ్యాంక్ వడ్డిరేట్లు తగ్గడం వంటి కారణాల వలన బంగారం పాజిటివ్‌గా కదిలే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఆర్బీఐ ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు సార్లు వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డిపాజిట్లపై రేట్లు తగ్గాయి. ఫలితంగా బంగారం వంటి వడ్డీ లేని రాబడులనిచ్చే ఆస్తులలో ఇన్వెస్టర్లు తమ సంపదను తెచ్చి పెడుతున్నారు.
అస్థిరంగా ఉన్న ఈక్విటీ మార్కెట్లు, దేశీయ కరెన్సీ బలహీనత వంటి అంశాలు కూడా బంగారం ధరలు పెరగడానికి కారణంగా ఉన్నాయి.
You may be interested
11900 పాయింట్ల వరకు నిఫ్టీ ర్యాలీ!
Monday 28th October 2019నిపుణుల అంచనా దేశీయ మార్కెట్లు క్రమంగా నెగిటివ్ మూడ్‌లోనుంచి బయటకు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే కొత్త సంవత్‌ను సూచీలు పాజిటివ్‌గా ఆరంభించాయి. పూర్తిగా ఎకానమీలో పరిస్థితులు మారకపోయినా, బుల్స్ క్రమంగా తమ పట్టు బిగించడానికే యత్నిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో సూచీలు క్రమంగా ముందుకే కొనసాగే అవకాశముందని నిపుణుల అంచనా. నిఫ్టీపై మార్కెట్ పండితుల అంచనాలు... 1. సమిత్ చవాన్, ఏంజల్ బ్రోకింగ్: చార్టుల్లో నిఫ్టీ కీలక నిరోధ
ఎస్బీఐ, ఐసీఐసీఐ మొండి బకాయిలు తగ్గాయ్...కానీ!
Monday 28th October 2019దేశీయ బ్యాంకుల్లో టాప్ బ్యాంకులైన ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో మంచి ఫలితాలు నమోదు చేశాయి. ముఖ్యంగా మొండిపద్దుల పెరుగుదలతో క్షీణత రెండు బ్యాంకుల ఫలితాల్లో కనిపించింది. అయితే మందగమన ప్రభావం ఇంకా ఉందని, ఆస్తుల నాణ్యత పరంగా బడా అకౌంట్ల పరిష్కారం జరగాల్సిఉందని ఇరు బ్యాంకుల చీఫ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా మొండిపద్దులు దాదాపుగా తగ్గాయని ఐసీఐసీఐబ్యాంకు తెలిపింది. దీనివల్లనే ఆస్తుల నాణ్యతలో మెరుగుదల కనిపించిందని