News


పెట్రోల్‌, బంగారం మరింత ప్రియం

Saturday 6th July 2019
Markets_main1562393519.png-26843

-పొగాకు ఉత్పత్తులు, విదేశీ కార్లు, ఏసీ, జీడిపప్పు ధరలు పైపైకి
-తగ్గనున్న ‘ఎలక్ట్రిక్‌’ విడి భాగాలు, కెమెరా పరికరాల ధరలు
-ఫోన్‌ చార్జర్లు, సెట్‌ టాప్‌ బాక్సులు తక్కువ ధరలకే..

ఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌, బంగారం, వెండి ధరలు మరింత పెరగనున్నాయి. ఇటు సిగరెట్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ఏసీల ధరలు సైతం అధికమవనున్నాయి. పన్నులు పెరుగుతుండటంతో వీటి ధరలు కూడా పెరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాల విడి భాగాలు, కెమెరా పరికరాలు, మొబైల్‌ ఫోన్ల చార్జర్లు, సెట్‌ టాప్‌ బాక్సులు ధరలు తగ్గనున్నాయి. ‘మేకిన్‌ ఇండియా లక్ష్యాన్ని సుసంపన్నం చేసుకోవడంలో భాగంగా పీవీసీ పైపులు, వీనైల్‌ ఫ్లోరింగ్‌, టైల్స్‌, యంత్ర భాగాలకు అమర్చే లోహ పరికరాలు, ఫర్నిచర్‌, ఆటో మొబైల్‌ పరికరాలు, జీడిపప్పుపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచుతున్నాం..’అని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్‌ వస్తువులపై కస్టమ్స్‌ సుంకాన్ని మినహాయింపుని ఎత్తివేస్తున్నట్లు చెప్పారు. ‘దేశీయ ముద్రణ రంగానికి ఊతమిచ్చేలా పామాయిల్‌కు సంబంధించిన స్టెరాయిన్‌, కొవ్వు నూనెలు, వివిధ రకాల కాగితపు ఉత్పత్తులపై మినహాయింపుని తొలగిస్తున్నాం. దిగుమతి చేసుకునే పుస్తకాలపై 5 శాతం కస్టమ్‌ డ్యూటీ విధిస్తున్నాం.’అని తెలిపారు. దేశ సరిహద్దు భద్రత, మేకిన్‌ ఇండియా వస్తువులకు విలువను చేకూర్చడం. దిగుమతులను తగ్గించుకోవడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయడం లాంటి లక్ష్యాలతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించామని ఆమె వివరించారు. 
పెట్రోల్‌, డీజిల్‌పై రూ.1 అదనపు పన్ను...
రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్‌ కింద పెట్రోల్‌, డీజిల్‌ ఒక లీటర్‌పై రూ.1 ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ పన్ను విధించినట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 10 నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. ఇటు బీడీలు, సిగరెట్లపై పరిమాణం, రకాన్ని బట్టి 10 పైసల నుంచి రూ.10 వరకు ఎక్సైజ్‌ డ్యూటీ విధించారు. అలాగే హుక్కా, జర్దాలాంటి పొగాకు ఉత్పత్తులపై 0.5 శాతం నుంచి 1 శాతం వరకు ఎక్సైజ్‌ డ్యూటీ విధించారు. పూర్తిగా విదేశాల్లో తయారైన వాహనాలు, విదేశీ కార్ల దిగుమతులపై 25 శాతం నుంచి 30 శాతానికి కస్టమ్స్‌ డ్యూటీని పెంచినట్లు చెప్పారు. ఆటో మొబైల్‌ పరికరాలు, వాహనాల ఇంజన్ల ఫిల్టర్లు, అద్దాలు, తాళాలపై 2.5 శాతం నుంచి 5 శాతానికి.. మార్బుల్స్‌పై 20 శాతం నుంచి 40 శాతానికి, ఏసీలపై 10 శాతం నుంచి 20 శాతానికి కస్టమ్స్‌ డ్యూటీని పెంచినట్లు చెప్పారు. సెరామిక్‌ టైల్స్‌, గోడకు అతికించే టైల్స్‌ వంటి వాటిపై 10 శాతం నుంచి 15 శాతానికి.. దిగుమతి చేసుకునే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ దాని సంబంధిత పరికరాలపై 5 శాతం నుంచి 7.5 శాతానికి కస్టమ్స్‌ డ్యూటీ పెంచినట్లు వెల్లడించారు. ఇక సీసీటీవీ కెమెరా/ఐపీ కెమెరా చార్జర్‌, చార్జింగ్‌ కేబుల్‌, లౌడ్‌ స్పీకర్లు, ఆఫ్టికల్‌ ఫైబర్‌లపై 15 శాతం.. డిజిటల్‌ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌), సీసీటీవీ కెమెరా, ఐపీ కెమెరాలపై 5 శాతం నుంచి 20 శాతం కస్టమ్‌ డ్యూటీ పెంచినట్లు ఆమె తెలిపారు.
‘ఎలక్ట్రిక్‌’పరికరాలపై పన్ను మినహాయింపు...
ఇక ఎలక్ట్రిక్‌ వాహనాల పరికరాలపై కస్టమ్‌ డ్యూటీని మినహాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అలాగే ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీకి కావాల్సిన ముడి సరుకులు, కెమెరాకు సంబంధించిన పరికరాలు, మొబైల్‌ ఫోన్‌ చార్జర్లు, సెట్‌ టాప్‌ బాక్సుల ధరలు మరింత తగ్గుతాయని వెల్లడించారు. ‘రక్షణ వ్యవస్థను వీలైనంత త్వరగా ఆధునీకరించుకోవాల్సిన అవసరముంది. ఇది జాతీయ ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. అందుకే విదేశాల్లో తయారైన రక్షణ సాధనాల దిగుమతులపై కూడా కస్టమ్‌ డ్యూటీని మినహాయిస్తున్నాం. అలాగే ఊలు దారాలు, నాప్తా, కృత్తిమ మూత్రపిండాల తయారీకి సంబంధించిన ముడిపదార్థాలు, అణువిద్యుత్‌కు సంబంధించిన ఇంధన పదార్థాలపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపును ప్రతిపాదించారు.You may be interested

అష్టలక్ష్మి గ్రామోస్తుతే..

Saturday 6th July 2019

కేంద్ర బడ్జెట్‌ ‍ప్రవేశపెట్టిన రెండో మహిళా మంత్రిగా రికార్డుల కెక్కిన నిర్మలా సీతారామన్‌.. ఓ మహిళగా, ఓ సాధారణ కుటుంబం వచ్చిన మహిళగా.. కేంద్ర మంత్రిగా ఆలోచించారు. సొంతింటి కలనుంచి.. దేశ రక్షణ వరకు తనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట ఒక మహిళగా.. అదీ ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నిర్మలా సీతారామన్‌కు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలు పడే ఇబ్బందులు

మేకిన్‌ ఇండియా దిశగా మోదీ 2.0 బడ్జెట్‌

Saturday 6th July 2019

లోక్‌సభలో 2019-20 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సుదీర్ఘ ప్రసంగంతో ఆకట్టుకున్న మహిళా ఆర్థిక మం‍త్రి మొత్తం రూ. 27,86,349 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదన స్టార్టప్‌లకు, కార్పొరేట్లకు ప్రోత్సాహకాలు అత్యంత అధిక ఆదాయం ఉన్న వారికి సర్‌ ‘చార్జ్‌’ విద్యుత్‌ వాహనాల వినియోగానికి ప్రోత్సాహకాలు తొలిసారి ఇల్లు కొంటే మరో రూ. 1.5 లక్షల లబ్ధి పైపైకి ఎగబాకుతున్న పసిడి ధరలు సుంకాల పెంపుతో పెరిగిన పెట్రో రేట్లు   న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-2 ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి

Most from this category