News


చమురు ఉత్పత్తిలో మరింత కోత

Saturday 7th December 2019
Markets_main1575691193.png-30103

  • ఒపెక్‌ దేశాల నిర్ణయం

వియెన్నా: ముడి చమురు ఉత్పత్తిని మరింతగా తగ్గించాలని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్‌), దాని మిత్ర దేశాలు నిర్ణయించాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రోజుకు 5,00,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తికి కోత పడనుంది. ప్రస్తుత ఒప్పందం ప్రకారం అమలవుతున్న దానికి ఇది అదనం. దీంతో మొత్తం మీద ఉత్పత్తి కోత రోజుకు 1.7 మిలియన్ బ్యారెళ్లకు పెరగనుంది. వియెన్నాలోని ఒపెక్ ప్రధాన కార్యాలయంలో సమావేశం అనంతరం సభ్య దేశాలు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఉత్పత్తి తగ్గింపు విధానాన్ని వచ్చే ఏడాది మార్చి 5-6న నిర్వహించే అసాధారణ సమావేశంలో సమీక్షించనున్నట్లు పేర్కొన్నాయి. 



You may be interested

నెఫ్ట్‌ లావాదేవీలు ఇక 24x7

Saturday 7th December 2019

రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ డిసెంబర్‌ 16 నుంచి అమల్లోకి ముంబై: నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌/ఎన్‌ఈఎఫ్‌టీ) వ్యవస్థ మరింత సౌలభ్యంగా మారనుంది. రోజులో 24 గంటలు, వారంలో అన్ని రోజులూ (ఆదివారం, అన్ని సెలవుదినాల్లోనూ) నెఫ్ట్‌ లావాదేవీలను అనుమతించనున్నట్టు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. డిసెంబర్‌ 16 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. డిసెంబర్‌ 16న (డిసెంబర్‌ 15 అర్ధరాత్రి) 00.30 గంటలకు మొదటి

ప్రభుత్వం సాయం చేయకపోతే మూతే!!

Saturday 7th December 2019

(అప్‌డేటెడ్‌..) వొడా- ఐడియా బకాయిల భారంపై చైర్మన్‌ బిర్లా వ్యాఖ్య ఎకానమీ మెరుగుపడాలంటే ట్యాక్స్‌ రేట్ల తగ్గింపు సరిపోదు ఉద్దీపన చర్యలు అవసరమని వ్యాఖ్యలు న్యూఢిల్లీ: కేంద్రానికి చెల్లించాల్సిన పాత బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊరట చర్యలేమీ తీసుకోకపోతే కంపెనీని మూసివేయక తప్పదని టెలికం సంస్థ వొడాఫోన్‌- ఐడియా చైర్మన్‌ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. "ప్రభుత్వం నుంచి ఏ రకమైన తోడ్పాటూ లేకపోతే ఇక వొడాఫోన్‌ ఐడియా కథ ముగిసినట్లే. ఇందులో ఇంకా పెట్టుబడులు

Most from this category