News


స్వల్పంగా పెరిగిన చమురు..

Thursday 25th July 2019
Markets_main1564026680.png-27293

గత సెషన్‌లో 1 శాతం మేర పడిపోయిన చమురు ధరలు గురువారం ట్రేడింగ్‌లో స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 6 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు 63.24 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 12 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు 55.99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనల నేపథ్యంలో గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 1 శాతం, డబ్యూటీ క్రూడ్‌ 1.6 శాతం నష్టపోయి ముగిశాయి. అమెరికా, యూరోప్‌ కొనుగోలు నిర్వహణ సూచీ(పీఎంఐ) అంచనాల కంటే బలహీనంగా ఉండడం ఈ అంతర్జాతీయ మందగమనాన్ని తెలియజేస్తున్నాయని పరిశీలకులు తెలిపారు. 



You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Thursday 25th July 2019

ఐదు రోజులుగా వరుస నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. 85 పాయింట్ల లాభంతో 37,935 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కొద్దిసేపట్లోనే 150 పాయింట్లు లాభపడి 38,000 పాయింట్ల స్థాయిని దాటింది.  20 పాయింట్ల లాభంతో 11,292 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  కొద్ది నిముషాల్లోనే 11,300 పాయింట్ల స్థాయిని అధిగమించింది. 

మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులో తెలుగు ఇన్వెస్టర్లు ఎక్కడ...?

Thursday 25th July 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల (ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తులు జూన్‌లో 9.52 శాతం పెరిగి రూ.25.81 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తుల వాటా 42.3 శాతం. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫి) వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం... మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల్లో 41.8 శాతం వాటాతో మహారాష్ట్ర మరే రాష్ట్రానికీ అందనంత దూరంలో అగ్ర స్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూఢిల్లీ 8.9

Most from this category