News


60 డాలర్ల దిగువకు బ్రెంట్‌ క్రూడ్‌!

Wednesday 2nd October 2019
Markets_main1569992970.png-28669

గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు పడిపోవడంతో బుధవారం చమురు ధరలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.07 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.70  శాతం లాభపడి బారెల్‌ 59.30 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 1.12 శాతం లాభపడి బారెల్‌ 54.22 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కానీ యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన యుఎస్‌ ఉత్పాదక రంగం 10 ఏళ్ల కనిష్ఠానికి పడిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ట్రేడ్‌వార్‌ ప్రభావం వలన అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ ఆందోళనలు చమురు మార్కెట్‌ను వెంటాడుతున్నాయి. చమురు డిమాండ్‌ ఆందోళనల వలన గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 60 డాలర్ల దిగువకు, డబ్యూటీఐ క్రూడ్‌ 55 డాలర్ల దిగువకు పడిపోయాయి. 
  చమురు ధరలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయని, మంగళవారం సెషన్లో ఏర్పడిన నష్టాల నుంచి రికవరి అవుతున్నాయని ఓండా సీనియర్‌ ఎనలిస్ట్‌ జెఫ్ఫరే హాలీ అన్నారు. అయినప్పటికి కొన్ని ప్రాంతాలలో మార్కెట్‌లకు సెలవు ఉండడం వలన ట్రేడింగ్‌ వాల్యుమ్‌లు తక్కువగా ఉన్నాయని తెలిపారు. గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు 59 లక్షల బారెల్స్‌ తగ్గాయని అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌(ఏపీఐ)  మంగళవారం ప్రకటించింది. కాగా ఈ నిల్వలు గత వారానికి సంబంధించి 16 లక్షల బారెల్స్‌ పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేయడం గమనార్హం. యుఎస్‌ చమురు నిల్వలపై అధికారిక డేటాను ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈ రోజు విడుదల చేయనుంది. 
  సౌదీ చమురు ఉత్పత్తి తిరిగి సాధరణ స్థాయికి చేరుకోవడంతో చమురు ధరలు డ్రోన్‌ దాడికి ముందు ఉన్న స్థాయిలకు చేరుకున్నాయి. ‘ప్రస్తుతం చమురు మార్కెట్‌లో ఎటువంటి రిస్క్‌ ప్రీమియం జరగడం లేదు’ అని ఓసీబీసీ బ్యాంక్‌, ఆర్థిక వేత్త హోవీ లీ అన్నారు. వీటికి తోడు దక్షిణ అమెరికాకు చెందిన చమురు ఎగుమతి దేశం ఈక్విడర్‌, ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) నుంచి 2020 జనవరి 1 తర్వాత బయటకొచ్చేయాలని నిర్ణయించుకుంది. ఈ అంశం కూడా చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.



You may be interested

పీఎన్‌బీ ఎండీ, సీఈఓగా మల్లిఖార్జున రావు

Wednesday 2nd October 2019

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా సీహెచ్‌ ఎస్‌ఎస్‌ మల్లిఖార్జున రావు నియమితులయ్యారు. 57 సంవత్సరాల ఆయన ప్రస్తుతం అలహాబాద్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా నియమితులైన బాధ్యతల్లో 2021 సెప్టెంబర్‌ 18 వరకూ లేదా తదుపరి ఉత్తర్వ్యులు వెలువడేవరకూ కొనసాగుతారు. ‘‘మల్లిఖార్జునరావు పోస్టింగ్‌కు సంబంధించి ఆర్థిక సేవల శాఖ చేసిన ప్రతిపాదనను నియామక వ్యవహారాల క్యాబినెట్‌

ఫోర్డ్‌ ఇండియా ఆటో వ్యాపారం మహీంద్రా చేతికి

Wednesday 2nd October 2019

రెండు కంపెనీల ఆధ్వర్యంలో జేవీ దీని ఆధ్వర్యంలో ఫోర్డ్‌ వాహన విక్రయాలు న్యూఢిల్లీ: భారత మార్కెట్లో వ్యాపార పరంగా తీవ్ర పోటీ పరిస్థితుల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ(ఎఫ్‌ఎంసీ) మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం)తో జట్టు కట్టింది. రెండు కంపెనీల ఆధ్వర్యంలోని జాయింట్‌ వెంచర్‌(జేవీ)కు ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ భారత వ్యాపార కార్యకలాపాలు బదిలీ అవుతాయి. ఈ జేవీలో ఎంఅండ్‌ఎంకు 51 శాతం వాటా, మిగిలిన 49 శాతం వాటా

Most from this category