News


వాణిజ్య చర్చలకు ముందు లాభాల్లో చమురు!

Tuesday 8th October 2019
Markets_main1570520054.png-28774

గత సెషన్లో ఇండస్ట్రీయల్‌ కమోడిటీలు పెరగడంతో పాటు ఇరాక్, ఈక్విడార్‌ దేశాల ఆయిల్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో మంగళవారం ట్రేడింగ్లో చమురు ధరలు లాభపడి ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నాం 12.36 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.67 శాతం లాభపడి బారెల్‌ 58.74 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 0.72 శాతం లాభపడి బారెల్‌ 53.13 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘రాగి, అల్యూమినియం లండన్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. కానీ గత వారం తయారీ రంగం డేటాలో బలహీనంగా ఉండడంతో సాధారణంగా ఇండస్ట్రీయల్‌ కమోడిటీలు కొంత దిద్దుబాటుకు గురికావచ్చని తెలుస్తోంది’ అని చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్, సీఎంసీ మార్కెట్‌, మైఖేల్ మెక్కార్తి అన్నారు. 
    యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముగిసే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికి వాషింగ్టన్‌లో జరగబోయే యుఎస్-చైనా వాణిజ్య చర్చలకు ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారు. ‘ఈ వాణిజ్య చర్చలు ఎలా ముగుస్తాయో ఊహించడం కష్టమయినప్పటికి (యుఎస్) సుంకాలను నిరవధికంగా నిలిపివేస్తే చమురు ధరల ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది’ అని యాక్సిట్రేడర్‌, ఆసియా పసిఫిక్ మార్కెట్ వ్యూహకర్త స్టీఫెన్ ఇన్నెస్ ఒక నోట్‌లో ద్వారా తెలిపారు. కాగా ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండడంతో ఇరాక్, అంతర్గాతంగా ప్రభుత్వంపై నిరసనలు వెల్లువెత్తడంతో ఈక్వెడార్‌ నుంచి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇది చమురు ధరలకు మద్దతుగా ఉండగలవు.
  యుఎస్‌ చమురు నిల్వలు వరుసగా నాలుగవ వారంలో కూడా పెరుగుతాయని కానీ డిస్టిలేటడ్‌, గ్యాసోలిన్‌ నిల్వలు మాత్రం పడిపోతాయని రాయిటర్స్‌ ప్రాథమిక పోల్ సోమవారం ప్రకటించింది. దీంతో పాటు సౌదీ అరేబియా చమురు ఉత్పత్తి సమస్యలు ఊహించిన దాని కంటే ఎక్కువ కాలం కొనసాగినట్టయితే, రష్యా రోజుకు 0.3-0.5 మిలియన్ బారెల్స్ లేదా ప్రపంచ సరఫరాలో 0.3-0.5 శాతం సరఫరాను పెంచనుందని రష్యా ఇంధన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ రాయిటర్స్‌తో అన్నారు. ఈ అంశాలు చమురు ధరలను కిందికి లాగుతున్నాయి.You may be interested

11100 పాయింట్లే కీలకం!

Wednesday 9th October 2019

వరుసగా ఆరు సెషన్లు నిఫ్టీ నెగిటివ్‌గా ముగియడంతో ప్రస్తుతం ఓవర్‌సోల్డ్‌ పరిస్థితి కనిపిస్తోందని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆరు వరుస నష్టాల సెషన్లు మార్కెట్‌లో బుల్స్‌కు పగ్గాలు వేశాయంటున్నారు. నిఫ్టీ ప్రస్తుతం డైలీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. కీలకమైన 200, 100 రోజుల డీఎంఏ స్థాయిలకు దిగువకు వచ్చింది. ఇక నిఫ్టీకి అత్యంత కీలక మద్దతు తన 50 రోజుల డీఎంఏ స్థాయి 11087 వద్ద కనపడుతోంది. దీన్ని

బలపడిన డాలర్‌..నష్టాల్లో బంగారం

Tuesday 8th October 2019

యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలకు ముందు అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్‌లు పాజిటివ్‌గా ట్రేడవ్వడంతోపాటు, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో వరుసగా మూడవ సెషన్లో కూడా బంగారం ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ మార్కెట్లో ట్రేడయ్యే బంగారం ఫ్యూచర్స్‌  0.6 శాతం పడిపోయి 1495.20 డాలర్లకు దిగింది.  కరెన్సీ బాస్కెట్‌లో డాలర్ బలపడి 98.98 వద్ద నిలిచింది. కాగా యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలలో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని చైనా

Most from this category