News


స్వల్ప లాభాల్లో చమురు !

Thursday 26th September 2019
Markets_main1569476477.png-28563

యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య విభేదాలను తొలగించేందుకు ఒక రిజల్యూషన్‌ అనుకున్న సమయం కంటే ముందే రానుందని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో​ గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు ప్లాట్‌గా ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న చమురు సరఫరా ఒత్తిళ్లను, అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ ఆందోళనలను తగ్గించడానికి ఈ చర్య సహాయపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఉదయం 9.45 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.05 శాతం లాభపడి బారెల్‌ 61.46 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.14 శాతం లాభపడి బారెల్‌ 56.57 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
    చైనా, యుఎస్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చాలా ఆత్రుతగా ఉందని బుధవారం ట్రంప్‌ అన్నారు. అంతేకాకుండా మంగళవారం యుఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో చైనా వాణిజ్య విధానాలను ట్రంప్‌ విమర్శించిన విషయం కూడా తెలిసిందే. ట్రేడ్‌ వార్‌ ఒత్తిళ్లు తగ్గే అవకాశాలు మందగిస్తున్నాయని, అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనలు తిరగి ప్రభావం చూపుతున్నాయని యాక్సి ట్రేడర్‌ ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ స్టీఫెన్‌ ఇన్నెస్‌ అన్నారు. కాగా డ్రోన్‌ దాడి జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు గమనిస్తే, బ్రెంట్‌ క్రూడ్‌, డబ్యూటీఐ క్రూడ్‌ బుధవారం సెషన్‌లో  వాటి కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. ట్రేడ్‌ వార్‌ ఆందోళనలతో పాటు గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పడిపోవడం కూడా చమురు ధరలపై ప్రభావం చూపుతోంది. గత వారం యుఎస్‌ చమురు నిల్వలు 24 లక్షల బారెల్స్‌ పెరగడం గమనార్హం. వీటితో పాటు సౌదీ చమురు ఉత్పత్తి పునరుద్ధరణ వేగంగా జరుగుతుండడం కూడా చమురు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. 
  ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ గత మూడు నెలల్లో గరిష్ఠానికి చేరుకోవడంతో ఇతర కరెన్సీలలో చమురును కొనుగోలు చేసే దేశాలు అధికంగా నగదు చెల్లించవలసి వస్తుంది.



You may be interested

ఐసీఐసీఐ బ్యాంక్‌ కొత్త రికార్డు

Thursday 26th September 2019

ప్రైవేట్ రంగ బ్యాంక్‌ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో నేడు ఈ బ్యాంక్‌ షేర్లు రూ.439.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఒక దశలో 5.50శాతం లాభపడి రూ.458.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ ధర షేర్లకు జీవితకాల

లాభాల్లో పెట్రో షేర్లు...హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్ల ర్యాలీ

Thursday 26th September 2019

గరిష్ట స్థాయిలకు చేరుకున్న చమురు ధరలు గత కొన్ని సెషన్‌ల నుంచి పడిపోతుండడంతో దేశీయ ఇంధన కంపెనీ షేర్లు గురువారం సెషన్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. చమురు ధరలు తగ్గడంతో  హిందుస్థాన్‌ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్‌) షేరు ఉదయం 10.35 సమయానికి  5.22 శాతం లాభపడి రూ. 300.30 వద్ద, ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ) 4.87 శాతం లాభపడి రూ. 147.55 వద్ద, ఓన్‌జీసీ 2.05 శాతం లాభపడి రూ. 134.15 వద్ద ట్రేడవుతున్నాయి.

Most from this category