News


స్థిరంగా చమురు

Tuesday 25th June 2019
Markets_main1561436107.png-26543

అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల వాతవరణం చమురు ధరల పెరుగుదలకు  సహకరించిన క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గుదల ఒత్తిడి కారణంగా మంగళవారం(జూన్‌ 25) చమురు ధరలు స్థిరంగా ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.89 డాలర్ల వద్ద, అమెరికా క్రూడ్‌ 0.8శాతం నష్టపోయి 57.87 డాలర్ల వద్ద ముగిశాయి. అమెరికా తయారి రంగం మందగించిందని ఫలితంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గిందని సోమవారం ఫెడరల్‌ రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ డల్లాస్‌ ప్రకటించింది. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడికి తోడుగా ఇరాన్‌ అమెరికా డ్రోన్‌ను కూల్చివేసిందనే వార్తలు జోడవ్వడంతో గత వారం బ్రెంట్‌ క్రూడ్‌ 5 శాతం, అమెరికా క్రూడ్‌ 10శాతం లాభపడ్డాయి. అంతేకాకుండా అమెరికా ఇరాన్‌పై కొత్తగా ఆంక్షలు విధించడంతో  ఈ ఘర్షణ వాతవరణం ముదిరింది. ఇన్వెస్టర్లు జీ 20 సమావేశంలో అమెరికా-చైనా దేశాల చర్చలకై ఎదురుచూస్తుండడం, ఒపెక్‌, నాన్‌ ఒపెక్‌ దేశాలు జులై 1-2 న వియన్నాలో సమావేశమవుతుండడంతో ఈ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్ఠిపెట్టే అవకాశం ఉంది. 



You may be interested

ఆగని పసిడి పరుగు

Tuesday 25th June 2019

ప్రపంచమార్కెట్లో పసిడి పరుగు ఆగడం లేదు. ఆసియాలో ట్రేడింగ్‌లో మంగళవారం పసిడి మరో 24డాలర్లు ర్యాలీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పరిస్థితులు, కీలక వడ్డీరేట్లపై పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు మెతక వైఖరి ఇందుకు తోడ్పాటును అందిస్తున్నాయి. ఈ వారంతాన జరిగే జీ-20 సదస్సులో అగ్రరాజ్యాలైన అమెరికా - చైనా దేశాధ్యక్షులైన ట్రంప్‌-జింగ్‌పిన్‌ల మధ్య ట్రేడ్‌ వార్‌ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కూడా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు

మరింత బలపడిన రూపీ

Tuesday 25th June 2019

డాలర్‌ మారకంలో రూపీ బలపడి మంగళవారం(జూన్‌ 25) ట్రేడింగ్‌లో 69.32 వద్ద ప్రారంభమైంది. డాలర్‌ ఇతర మేజర్‌ కరెన్సీలతో పోల్చుకుంటే బలహీనపడడంతో రూపీ గత సెషన్‌లో 23 పైసలు బలపడి 69.35 ముగిసింది. ఫెడ్‌ వడ్డి రేట్ల కోత ఉంటుందనే నేపథ్యంలో డాలర్‌ బలహీనంగా ఉంది. దీంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫెడ్‌ వడ్డి రేట్లను తగ్గించాలని బోర్డుపై ఒత్తిడి తీసుకురావడం కూడా డాలర్‌ బలహీన పడడానికి

Most from this category