తగ్గిన యుఎస్ నిల్వలు ..పెరిగిన చమురు
By Sakshi

యుఎస్ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పడిపోవడంతో పాటు, యుఎస్-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఘర్షణ కొంత సరళం అవ్వడంతో చమురు ధరలు బుధవారం(అగస్టు 28) ట్రేడింగ్‌లో పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 0.7 శాతం పెరిగి బారెల్ 59.92 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్ 1 శాతం పెరిగి బారెల్ 55.50 డాలర్లకు చేరుకున్నాయి. గత వారం యుఎస్ చమురు నిల్వలు 20 లక్షల బారెల్ తగ్గుతుందని విశ్లేషకులు అంచనా వేయగా, అది 111 లక్షల బారెల్లు తగ్గిందని అమెరికన్ పెట్రోలియం ఇనిస్టిట్యూట్(ఏపీఐ) ఓ నివేదికలో పేర్కొంది. కాగా వారాంతానికి సంబంధించి ప్రభుత్వ అధికారిక డేటా బుధవారం వెలువడనుంది. ప్రభుత్వ ఈ తగ్గుదలను నిర్దారిస్తే గత 9 వారాలలో ఇదే అతి పెద్ద తగ్గింపవుతుంది. తగ్గిన యుఎస్ చమురు నిల్వలు కొంత కాలం పాటు చమురు మార్కెట్‌కు మద్ధతుగా ఉండగలదని వాలర్ మార్కెట్స్ మేనేజింగ్ పార్టనర్ స్టీఫెన్ ఇన్నెస్ అన్నారు. అయినప్పటికీ, తీవ్రమైన యుఎస్-చైనా ట్రేడ్‌వార్ వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో చిక్కుకుంటుందనే అందోళనలు చమురు లాభాలను పరిమితం చేయవచ్చు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఒక ఒప్పందం కుదుర్చుకోవాలనుకోవడం పట్ల చైనా చిత్తశుద్ధితో ఉందని చైనా వైస్ ప్రీమియర్ లియు హి అన్నారు. అంతేకాకుండా ‘ప్రశాంతమైన’ చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించడానికి చైనా సుముఖంగా ఉందని తెలిపారు. కానీ ట్రేడ్ వార్ గురించి మాట్లాడడానికి యుఎస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ చైనా ప్రభుత్వానికి రాలేదని, యుఎస్ ఇలాంటి తప్పుడు చర్యలను ఆపి, చర్చలకు ఉపకరించే పరిస్థితిని తీసుకురావలని ఆయన అనడం గమనార్హం. అమెరికా-చైనా వాణిజ్య యుధ్దం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, ఇది చమురు డిమాండ్ ఆందోళనలను ఇంకా పెంచుతాయనే అంచనాల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఈ ఏడాది ఏప్రిల్‌లో చేరుకున్న గరిష్ట స్థాయి నుంచి 20 శాతం పడిపోయాయి.
You may be interested
ఏటీఎంలకు తాళం..!
Wednesday 28th August 2019శాఖలనూ తగ్గించుకుంటున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు వ్యయాలు తగ్గించుకునేందుకే ఖాతాదారులు డిజిటల్ బాట పడుతుండటం కారణం ముంబై: పట్టణ ప్రాంతాల్లో ఖాతాదారులు బ్యాంకింగ్ లావాదేవీల కోసం డిజిటల్ విధానాలవైపు మళ్లుతుండటంతో ఏటీఎంలు, బ్యాంకు శాఖల అవసరం క్రమంగా తగ్గుతోంది. దీంతో పభ్రుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కూడా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా వీటిని తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఏటీఎంలు, శాఖల ఏర్పాటు, నిర్వహణ భారం తడిసి మోపెడవుతుండటం ఇందుకు కారణం. గడిచిన ఏడాది కాలంలో
ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్
Wednesday 28th August 2019అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 14 పాయింట్ల లాభంతో 37,655.77 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు స్వల్ప నష్టంతో 11,101.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడే వీలున్నట్లు పెరిగిన ఆందోళనలతో మంగళవారం అమెరికా మార్కెట్లు, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఇక