News


పెరిగిన చమురు ధరలు

Tuesday 27th August 2019
Markets_main1566879098.png-28039

యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఎదురుచూస్తున్నానని అనడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒత్తిడి కొం‍త సరళతరం అయ్యింది. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.5 శాతం పెరిగి బారెల్‌ 58.97 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.4 శాతం పెరిగి బారెల్‌ 53.87 డాలర్లకు చేరుకున్నాయి. కాగా ఈ ట్రేడ్‌ వార్‌ తీవ్రతరం అవ్వడంతో గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 1 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 1 శాతం నష్టపోయాయి. యుఎస్‌తో వాణిజ్య ఘర్షణలను పరిష్కరించుకునేందుకు చైనా సుముఖంగా ఉందని, ఇక ట్రేడ్‌ వార్‌ ఒత్తిడి పెరగడాన్ని వ్యతిరేకిస్తున్నామని చైనా వైస్‌ ప్రీమియర్‌ లీ హీ సోమవారం అనడంతో యుఎస్‌ కూడా తాము చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఎదురుచూస్తున్నామని సోమవారం ప్రకటించింది. రెండు అగ్ర ఆర్థిక దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఘర్షణలు తగ్గుముఖం పడతాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. యుఎస్‌-చైనా ట్రేడ్‌ వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలు, చమురు డిమాండ్‌ ఆందోళనల వలన చమురు ధరలు 2019 ఏప్రిల్‌లో చేరుకున్న గరిష్ట స్థాయి నుంచి 20 శాతం పడిపోవడం గమనార్హం. 
    ముడి చమురు, వ్యవసాయ ఉత్పత్తులు, చిన్న విమానాలతో సహా యుఎస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం 5,078 ఉత్పత్తులపై 5 శాతం లేదా 10 శాతం అదనపు సుంకాలను విధిస్తామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా, చైనాలో కార్యకలాపాలను మూసివేసి, యుఎస్‌లో ఉత్పత్తులను తయారుచేసే మార్గాలను అన్వేషించాలని యుఎస్‌ కంపెనీలను ట్రంప్ కోరారు. ‘యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం జరుగుతుందని నమ్మకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఆదాయాలు ఒత్తిడికి లోనవుతాయి’ అని మెక్కెన్నా మాక్రో వ్యూహకర్త, గ్రెగ్ మెక్కెన్నా అన్నారు. ట్రేడ్‌ వార్‌కితోడు యుఎస్ ముడి చమురు, గ్యాసోలిన్ నిల్వలు గత వారం పడిపోయాయని, డిస్టిలేట్‌ నిల్వలు పెరిగాయని రాయిటర్స్ పోల్ సోమవారం తెలిపింది. అగష్టు 23తో ముగిసిన వారంలో క్రూడ్‌ నిల్వలు 21 లక్షల బారెల్‌లు పడిపోయాయని రాయిటర్స్ పోల్ అంచనా వేసింది. ఈ అంశం కూడా చమురు ధరలను ప్రభావితం చేస్తుంది.



You may be interested

71.70 వద్ద రూపీ ప్రారంభం

Tuesday 27th August 2019

అంతర్జాతీయ పరిణామాలతో పాటు చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించుకోవడంతో రూపీ డాలర్‌ మారకంలో స్వల్పంగా బలహీనపడి 71.70 వద్ద ప్రారంభమైంది. తీవ్రమైన యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 72 మార్కును దాటగా, దేశియ ఈక్విటీ మార్కెట్‌లు ర్యాలీ చేయడంతో తిరిగి కోలుకొని​ 71.67 వద్ద ముగిసింది. ఉదయం 9.49 సమయానికి రూపీ డాలర్‌ మారకంలో 71.83 వద్ద ట్రేడవుతోంది.

విస్తరణ బాటలో ‘రెడ్ చీఫ్’

Tuesday 27th August 2019

గురుగ్రామ్‌లో నూతన స్టోర్‌ ఏర్పాటు ప్రముఖ లెదర్‌ బ్రాండ్‌ ‘రెడ్ చీఫ్’ తన విస్తరణ ప్రణాళికను వేగవంతం చేసింది. తాజాగా గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 14లో ఎక్స్‌క్లూజీవ్‌ ప్రీమియం బ్రాండ్‌ స్టోర్‌ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ మనోజ్ జ్ఞాన్‌చాందని మాట్లాడుతూ.. ‘మా బ్రాండ్‌కు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా షోరూంల సంఖ్యను పెంచుతున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 30 స్టోర్లను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఈ శరదృతువులో అనేక ఆఫర్లను

Most from this category