News


ఒక శాతం పెరిగిన చమురు ధరలు

Thursday 20th June 2019
Markets_main1561005478.png-26430

అమెరికా చమురు నిల్వలు ఊహించని దానికంటే ఎక్కువగా పడిపోవడంతో పాటు ఒపెక్‌ దేశాలు, ఇతర ఉత్పత్తి దేశాల సమావేశానికి తేదీ ఖరారు కావడంతో గురువారం చమురు ధరలు ఒక శాతం పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 1.3శాతం పెరిగి బ్యారెల్‌ 62.64డాలర్ల వద్ద, డబ్యుటీఐ క్రూడ్‌ 1.5శాతం పెరిగి బ్యారెల్‌ 54.55డాలర్ల వద్ద  ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 0.5శాతం, డబ్యుటీఐ క్రూడ్‌ 0.26 శాతం నష్టపోయిన విషయం తెలిసిందే. అమెరికా నిల్వలు రెండు సంవత్సరాల గరిష్ఠానికి పెరిగిన తర్వాత 1.1మిలియన్‌ బ్యారెల్‌ తగ్గుతాయని ఊహించామని కానీ 3.3 మిలియన్‌ బ్యారెల్‌ తగ్గాయని ఎనర్జీ ఇన్ఫ్‌ర్మేషన్‌ అడ్మినిష్ట్రేషన్‌(ఈఏఏ) తెలిపింది. దీంతో పాటు ఒపెక్‌ దేశాలు జులై 1న, నాన్‌ ఒపెక్‌ దేశాలు జులై2 న సమావేశాం కానున్నాయి. ఈ సమావేశంలో ఉత్పత్తి తగ్గుదల రోజుకి 1.2 మిలియన్‌ బ్యారెల్‌ను మార్చలా అనే అంశంపై చర్చించనున్న నేపథ్యంలో చమురుధరలు పెరిగాయి.  You may be interested

గురువారం వార్తలోని షేర్లు

Thursday 20th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  అపోలో హాస్పిటల్‌:- హెచ్‌డీఎఫ్‌సీ అపోలో మ్యూనిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలో మెజారిటా వాటాను కొనుగోలు చేసింది. అపోలో హాస్పిటల్‌ నుంచి రూ.1347 కోట్లకు రూ.51.2 శాతం వాటను కొనుగోలు చేయనుంది. ఈ మొత్తం వాటాను హెచ్‌డీఎఫ్‌సీ సొంత బీమా సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌లో విలీనం చేయనుంది.  అదానీ​గ్రీన్‌ ఎనర్జీ:- తన అనుబంధ సం‍స్థ అదానీ రెన్యూవబుల్‌ ఎనర్జీ పార్క్‌... సోలార్‌

20 పైసలు బలపడిన రూపీ

Thursday 20th June 2019

డాలర్‌ మారకంలో రూపీ గురువారం 20 పైసలు బలపడి 69.48వద్ధ ప్రారంభమైం‍ది. ఫెడ్‌ సమావేశం బుధవారం సాయంత్రం జరగడంతో 69.68 వద్ధ ఫ్లాట్‌ గా ముగిసింది. రూపీ తక్కువ పరిధిలో కదలాడే అవకాశం ఉందని మోతిలాల్‌ ఉస్వాల్‌ అన్నారు. ఫెడ్‌ వడ్డి రేట్లను యదాతథంగా ఉంచినప్పటికి భవిష్యత్‌లో వడ్డిరేట్లను తగ్గించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత డాలర్‌ బలహీన పడింది. యూఎస్‌లో ద్రవ్యోల్బణం 1.8శాతం

Most from this category