News


రేట్ల కోత అంచనా..పెరిగిన చమురు

Tuesday 30th July 2019
Markets_main1564461493.png-27394

ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న  యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉంటుందనే అంచనాల మధ్య చమురు ధరలు మంగళవారం ట్రేడింగ్‌లో పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.5 శాతం పెరిగి 64.01 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.6 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.21 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 0.4 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 1.2 శాతం పెరిగాయి.  ఫెడ్‌ వడ్డీ రేట్ల కోత దన్నుతో ఆయిల్‌ ధరలు పెరిగాయని ఏఎన్‌జెడ్‌ రీసెర్చ్ నోట్‌లో పేర్కొంది. దీనితో పాటు చైనా-యుఎస్ వాణిజ్య చర్చలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కూడా ధరలకు మద్దతు ఇస్తున్నాయని వివరించింది. 
  గత దశాబ్దకాలంలో మొదటి సారిగా ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గించనుందని పరిశీలకులు తెలిపారు. యుఎస్‌ రెండవ త్రైమాసికం నిరాశపరచడం, ఆర్థిక వ్యవస్థ మందగమనానికి రుజువని వివరించారు. యుఎస్‌-చైనా మధ్య జరగనున్న వాణిజ్య చర్చలు రెండు పెద్ద దేశాల మధ్య అంతరాయాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. కానీ 2020 యుఎస్‌ ఎన్నికల తర్వాత చైనాతో వాణిజ్య ఒప్పందపై సంతకం చేయకూడదని ట్రంప్‌ అనడం గమనర్హమని విశ్లేషకులు తెలిపారు. హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నందున సరఫరా ప్రమాదాలు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నాయి. జిబ్రాల్టర్ సమీపంలో బ్రిటిష్ దళాలు ఇరాన్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇరాన్ కమాండోలు ఈ నెలలో గల్ఫ్‌లో బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుంది. ఫలితంగా ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.You may be interested

ఎగిసిన పసిడి

Tuesday 30th July 2019

ప్రపంచమార్కెట్లో బంగారం ధరలు బలపడుతున్నాయి. ఆసియా ట్రేడింగ్‌లో 6డాలర్లు పెరిగింది. నేటి రాత్రి నుంచి రెండురోజులు పాటు (జూన్‌ 30, 31) జరగనున్న ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశం నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహిస్తూ పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. అలాగే యూరోపియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం(బ్రెగ్జిట్‌) కష్టతరమైన అంశమని బ్రిటన్‌ కొత్త ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వ్యాఖ్యానించడం కూడా పసిడి ధరకు మద్దతినిస్తున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ రెండు నెలల

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 30th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌:- యజమాని వీజీ సిద్ధార్థ నిన్న సాయంత్రం(జూలై 19న) నుంచి అదృశ్యమయ్యారు. అతని ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వస్తుంది. జీ లిమిటెడ్‌:- కంపెనీలో సుభాష్‌ చంద్ర వాటా కొనుగోలుకు అమెరికా ఆధారిత కేబుల్‌ కంపెనీ లుపా సిస్టమ్స్‌ బైండింగ్‌ ఆఫర్‌ నుంచి బైండింగ్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్‌:- రైకా కమర్షియల్ వెంచర్స్ కంపెనీ ఓపెన్‌ మార్కెట్‌ ఆఫర్‌ పద్ధతిలో

Most from this category