News


పాజిటివ్‌గా క్రూడ్‌ ఆయిల్‌!

Friday 4th October 2019
Markets_main1570163649.png-28711

చమురు ధరలు శుక్రవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ఉన్నాయి. అయినప్పటికి అంతర్జాతీయంగా ఆయిల్‌ డిమాండ్‌ తగ్గడంతో పాటు, సౌదీ చమురు ఉత్పత్తి సామర్ధ్యం తిరిగి సాధరణ స్థాయికి రావడంతో చమురు ధరలు బేరిష్‌ ట్రెండ్‌లోనే ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు.  ఉదయం 9.45 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.35 శాతం లాభపడి బారెల్‌ 57.91 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.34 శాతం లాభపడి బారెల్‌ 52.63 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా చమురు డిమాండ్‌ ఆందోళనలు వెంటాడుతుండడంతో ఈ వారంలో బ్రెంట్‌ క్రూడ్‌ 6.7 శాతం నష్టపోయింది. ఇది గత డిసెంబర్‌ నెల తర్వాత అత్యధిక వారపు నష్టం. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ ఈ వారం 6 శాతం నష్టపోయింది. ఇది ఈ జులై నెల తర్వాత అత్యధికంగా ఒక వారం ఏర్పడిన నష్టం కావడం గమనార్హం. 
   గురువారం విడుదలైన యుఎస్‌ సర్వీస్‌ సెక్టార్‌, ఉద్యోగ డేటా, బలహీనంగా ఉండడంతో చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. అంతేకాకుండా యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంధ్యంలోకి వెలుతుందనే అంచనాలకు, యుఎస్‌ బలహీన ఆర్థిక వ్యవస్థ ఆజ్యం పోస్తుంది. ‘అంతర్జాతీయ డిమాండ్‌ ఆందోళనల వలన గత కొన్ని సెషన్‌ల నుంచి చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. వచ్చే వారం యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య చర్చలు జరగనుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండనున్నారు’ అని ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ ఆక్సిట్రేడర్‌ స్టీఫెన్‌ ఇన్నెస్‌ అన్నారు. వీటితో పాటు చమురు కేంద్రాలపై దాడి తర్వాత సౌదీ తన పూర్తి సామర్ధ్యానికి తిరిగి చేరుకుందని సౌదీ ప్రభుత్వం ప్రకటించడంతో కూడా చమురు ధరలు నష్టాలో బాటాలో నడవడానికి కారణమవుతోంది. ‘



You may be interested

నాలుగో రోజూ లాభాల్లోనే పసిడి

Friday 4th October 2019

అమెరికా ఆర్థిక గణాంకాలు అంతంత మాత్రంగా నమోదు కావడంతో ఆర్థిక ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర నాలుగో రోజూ లాభాల్లో ట్రేడ్‌ అవతుంది. ఆసియాలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 2డాలర్లు లాభపడి 1,516 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతుంది. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌ ఈసారి కూడా వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ బలహీన ట్రేడింగ్‌ లాంటి అంశాలు

గ్యాప్‌అప్‌ ప్రారంభం

Friday 4th October 2019

కొద్ది రోజులుగా క్షీణతను చవిచూస్తున్న భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 295 పాయింట్ల లాభంతో 38,400 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 11,388 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

Most from this category