News


తగ్గిన అమెరికా నిల్వలు..పెరిగిన చమురు

Wednesday 24th July 2019
Markets_main1563941351.png-27264

అమెరికా చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా తగ్గడంతో పాటు అమెరికా నావీ గత వారం ఇరాన్‌ డ్రోన్‌ను కూల్చివేశామని ప్రకటించడంతో బుధవారం క్రూడ్‌ ఆయిల్‌ తన లాభాలను కొనసాగిస్తోంది. బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌కు 0.4 శాతం పెరిగి 64.07 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.21 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 1 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 1 శాతం పెరిగి ముగిశాయి. 
   జూలై 19 వరకు గల వారంలో అమెరికా ముడి చమురు నిల్వలు ఊహించిన దానికంటే ఎక్కువగా పడిపోయాయి. ఇది 40 లక్షల  బారెల్స్ తగ్గుతాయని విశ్లేషకుల అంచనా వేస్తే 110 లక్షల బారెల్స్ తగ్గి 4,490 లక్షల బ్యారెల్స్‌కు పడిపోయాయని ట్రేడ్ గ్రూప్ అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ మంగళవారం తెలిపింది.  ఓక్లహోమాలోని కుషింగ్ వద్ద ముడి నిల్వలు 448,000 బ్యారెల్స్ తగ్గాయి, అయితే గ్యాసోలిన్ నిల్వలు 44 లక్షల బారెల్స్ పెరిగాయి. వీటిపై అమెరికా ప్రభుత్వ అధికారిక గణాంకాలు బుధవారం ఉదయం వెలువడనున్నాయి.
 యుఎస్ యుద్ధనౌక బాక్సర్ గత వారం ఇరాన్‌ రెండవ డ్రోన్‌ను కూల్చివేసి ఉండవచ్చని అమెరికా అధికారి ఒకరు రాయిటర్స్‌తో చెప్పారు. అయినప్పటికీ ఇంకా ఈ విషయంపై ఎటువంటి స్పష్టత రాలేదు. ఇరాన్‌ ఆయిల్‌ ఎగుమతులను తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తుండడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. 



You may be interested

11300 దిగువకు నిఫ్టీ

Wednesday 24th July 2019

మిశ్రమంగా ప్రారంభమైన మార్కెట్‌ క్రమంగా నష్టాల్లోకి మళ్లింది. నిఫ్టీ 33 పాయింట్లను నష్టపోయి 11300 స్థాయిని కోల్పోయి 11,292 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెనెక్స్‌ సెంచరీ(101) పాయింట్లు పతనమై 37,881.03 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్నిరంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువ కొనసాగుతుంది. అటో, మెటల్‌ షేర్లలో విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ పావుశాతం(50 పాయింట్లు) 29,056.65 వద్ద ట్రేడ్‌

సెన్సెక్స్‌ ప్లస్‌..నిఫ్టీ మైనస్‌

Wednesday 24th July 2019

అమెరికా-చైనాల మధ్య వచ్చేవారం నుంచి వాణిజ్య చర్చలు పునర్‌ ప్రారంభమవుతున్నాయన్న వార్తలతో బుధవారం ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నా, భారత్‌ సూచీలు దాదాపు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 8 పాయింట్ల లాభంతో 37,985 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 11,322 పాయింట్ల వద్ద మొదలయ్యింది. 

Most from this category