News


ఇరాన్‌ ట్యాంకర్‌పై దాడి..పెరిగిన చమురు

Monday 14th October 2019
Markets_main1571027765.png-28865

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం పెరగడంతోపాటు, యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం కుదరడంతో శుక్రవారం సెషన్‌లో చమురు ధరలు 2 శాతం మేర పెరిగాయి. మధ్యప్రాచ్యంలో ఒత్తిళ్లు కొనసాగుతుండడంతో సోమవారం ట్రేడింగ్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ప్లాట్‌గా ప్రారంభమైంది. ఉదయం 9.53 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.40 శాతం నష్టపోయి బారెల్‌ 60.27 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.48 శాతం నష్టపోయి 54.44 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.  కాగా గత వారంలో ఈ రెండు కాంట్రాక్టులు 3 శాతం పైగా లాభపడడం గమనార్హం.
  ఎర్రసముద్రంలో సౌదీ అరెబీయా తీరం వద్ద ఇరాన్‌ ఆయిల్‌ ట్యాంక్‌ర్‌పై దాడి జరగడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం పెరిగింది. ఇప్పటి వరకు ఈ దాడి ఎవరు చేశారనే అంశంపై స్పష్టత లేనప్పటికి, ఈ దాడికి సౌదీ కారణమయితే ఇరాన్‌-సౌదీ అరేబియా మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత ముదిరే అవకాశం ఉంది. దీనితో పాటు యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం కుదరడంతో చమురు ధరలు లాభపడ్డాయి.



You may be interested

ఐఆర్‌సీటీసీ.. అదరగొట్టింది!

Monday 14th October 2019

బంపర్‌ లిస్టింగయిన షేరు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) షేరు మార్కెట్లో శుభారంభం చేసింది. ఇష్యూ ధర కన్నా భారీ ప్రీమియంతో షేరు సోమవారం లిస్టింగయింది. ఇష్యూ ధర రూ. 320 కాగా లిస్టింగ్‌ 101.25 శాతం ప్రీమియంతో రూ. 644వద్ద జరిగింది. ఇది మార్కెట్‌ వర్గాల అంచనాల కన్నా, గ్రేమార్కెట్‌ సంకేతాల కన్నా చాలా అధికం. లిస్టింగ్‌ అనంతరం దూసుకుపోయిన షేరు ఒక దశలో రూ. 698ని

11100- 11600 రేంజ్‌లో నిఫ్టీ!

Monday 14th October 2019

నిపుణుల అంచనా నిఫ్టీ డెరివేటివ్స్‌ డేటా పరిశీలిస్తే 11100, 11200 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉండగా, 11400, 11500పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా ఉన్నాయి. అందువల్ల ఈ సీరిస్‌కు 111000, 11600 పాయింట్లు మద్దతు, నిరోధాలుగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి పతనంసమయంలో నిఫ్టీ గత కన్సాలిడేషన్‌ రేంజ్‌ను కాపాడుకోగలిగింది. దీంతో నిఫ్టీలో తక్షణ పతనం భయాలు లేవని నిపుణులు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ అంశాల ఆధారంగా తీవ్ర కదలికలుంటాయని

Most from this category