News


58 డాలర్ల దిగువకు చమురు!

Wednesday 9th October 2019
Markets_main1570599381.png-28781

  యుఎస్-చైనా మధ్య గురువారం ప్రారంభం కానున్న వాణిజ్య చర్చలలో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా బుధవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.44 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.41 శాతం పడిపోయి బారెల్‌ 58 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.49 శాతం పడిపోయి బారెల్‌ 52.37 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‍కాగా యుఎస్‌-చైనా ప్రతినిధులు వాణిజ్య చర్చలలో భాగంగా గురువారం వాషింగ్టన్‌లో సమావేశం కానున్నారు. కానీ యుఎస్‌ ప్రభుత్వం ముస్లింలకు విసా నిరాకరించడంలో భాగంగా కొంత మంది చైనా ప్రతినిధులకు విసాను నిరాకరించింది. అంతేకాకుండా చైనా సాంకేతిక కంపెనీలను బ్లాక్‌ లిస్ట్లో పెట్టింది. ఈ చర్యల వలన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతవరణం ముదరడంతో వాణిజ్య చర్చలలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే విషయమై అవకాశాలు తగ్గాయి. ఇది అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌పై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు తెలిపారు. ఈ చర్యలు ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకోకుండా చేస్తున్నాయని సింగపూర్‌ ఓసీబీసీ బ్యాంక్‌ ఆర్థిక వేత్త హౌ లీ అన్నారు. ‘ అధికంగా డిమాండ్‌ వైపు దృష్ఠి సారించడంతో, ప్రస్తుతం చమురు మార్కెట్‌లో ఓవర్‌ బేరిష్‌ ఉంది’ అని ఆయన అన్నారు. 
    ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) దేశామయిన ఈక్విడర్‌లో అంతర్గత ప్రభుత్వ వ్యతిరేక నిరసనల వలన చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతవరణం కొనసాగుతున్నప్పటికి డిమాండ్‌ ఆందోళనల వలన చమురు ధరలు నష్టపోతున్నాయని విశ్లేషకులు తెలిపారు. ఈక్విడర్‌లో పరిస్థితులవలన, ఇక్కడ చమురు ఉత్పత్తి రోజుకు 188,000 బారెల్స్‌ తగ్గడం లేదా మొత్తం చమురు ఉత్పత్తిలో మూడవ భాగం పడిపోవడం జరగుతోందని తెలిపారు.
    వీటితో పాటు అక్టోబర్‌ 4తో ముగిసిన వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు 41 లక్షల బారెల్‌ పెరిగాయని అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టీట్యూట్‌ మంగళవారం ప్రకటించింది. కాగా ఈ పెరుగుదల 14 లక్షల బారెల్స్‌ ఉంటాయని విశ్లేషకులు అంచనావేయడం గమనార్హం. ఈ అంశం కూడా చమురు ధరలు పడిపోడానికి కారణంగా ఉంది. దీనిపై యుఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఈఐఏ) డేటా బుధవారం వెలువడనుంది. You may be interested

ఫలితాలకు ముందు నష్టాల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌

Wednesday 9th October 2019

దిగ్గజ ఐటీ కంపెనీల క్యూ2 ఫలితాలు ఇంకో రెండు రోజులలో రానుండడంతో ఐటీ షేర్లపై ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా బుధవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 11.50 సమయానికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.18 శాతం నష్టపోయి 15,067.00 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌ షేర్లయిన  టీసీఎస్‌ 0.92     శాతం నష్టపోయి రూ. 2,028.85 వద్ద, ఇన్ఫోసిస్‌ 1.30 శాతం నష్టపోయి

యస్‌ బ్యాంక్‌ 8 శాతం డౌన్‌

Wednesday 9th October 2019

గత కొంత కాలంగా నిధుల సమీకరణలో ఇబ్బందులు పడుతున్న యెస్‌ బ్యాంక్‌, ప్రమోటర్‌ రాణా కపూర్‌ తన వాటాను విక్రయించుకోవడంతో మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయింది. బ్యాంక్‌కు అవసరమైన నిధులను సరైనా ధర వద్దనే సమీకరిస్తామని బ్యాంక్‌ సీఈఓ రవనీత్‌ గిల్‌ ప్రకటించారు. కానీ దీంతో నిధుల సమీకరణ ఆలస్యం కానుందనే అంచనాలు మార్కెట్‌ వర్గాలలో వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా గత కొన్ని సెషన్ల నుంచి ఈ బ్యాంక్‌ షేరు నష్టాల్లో ట్రేడవుతోంది.

Most from this category