STOCKS

News


తగ్గిన దక్షిణ కొరియా వృద్ధి..నష్టాల్లో చమురు

Tuesday 3rd September 2019
Markets_main1567486452.png-28159

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా ఇరు దేశాలు విధించుకున్న తాజా సుంకాల సెప్టెంబర్‌ 1 నుంచి అమలులోకి రావడంతో ట్రేడ్‌ వార్‌ భయాలు పెరిగాయి. అంతేకాకుండా ఎగుమతులు తగ్గడంతో దక్షిణ కొరియా రెండవ త్రైమాసికపు వృద్ధి మందగించించింది. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 7 సెంట్లు తగ్గి బారెల్‌ 58.59 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 32 సెంట్లు తగ్గి బారెల్‌ 54.78 డాలర్లకు పడిపోయాయి.  చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై సుంకాలను యుఎస్‌ 15 శాతానికి పెంచగా, యుఎస్‌ దిగుమతి చేసుకుంటున్న 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై చైనా కొత్తగా సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ తాజా సుంకాలు సెప్టెంబర్‌ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఇరు దేశాల మధ్య ట్రేడ్‌వార్‌ ముదురుతుండడంతో, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఆందోళనలు పెరిగాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం వలన దక్షిణ కొరియా ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా ఈ దేశ రెండవ త్రైమాసికపు వృద్ధి రేటు అంచనాల కంటే పడిపోయింది. 
  వీటితో పాటు క్యాపిటల్‌ నియంత్రణపై అర్జెంటీనా ఆదివారం చర్యలు తీసుకోవడం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు నష్టపోడానికి కారణమని విశ్లేషకులు తెలిపారు. ‘ప్రపంచ వృద్ధి దృక్పథం బాగలేకపోతే చమురు దృక్పథం కూడా నష్టాల్లోనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో​ఇన్వెంటరీలలో భారీ తగ్గుదల మాత్రమే ఈ నష్టాలను ఆలస్యం చేయగలవు’ అని మెకెన్నా మాక్రో వ్యూహకర్త గ్రెగ్ మెక్కెన్నా అన్నారు. యుఎస్‌ మార్కెట్‌లకు సోమవారం సెలవు కావడంతో ఈ వారం యుఎస్ ఇన్వెంటిరీ డేటా బుధవారం, గురువారం వెలువడే అవకాశం ఉంది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్), కొంతమంది నాన్-ఒపెక్ ఉత్పత్తిదారుల మధ్య కుదిరిన చమురు ఉత్పత్తి కోత ఒప్పందాన్ని సెప్టెంబరులో పూర్తిగా పాటించాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుందని రష్యా ఇంధన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. You may be interested

ట్రేడ్‌వార్‌ ఎఫెక్ట్‌ : పసిడి మరో 10డాలర్ల ర్యాలీ

Tuesday 3rd September 2019

అగ్రరాజ్యాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం పసిడి ధరకు బాగా కలిసొస్తుంది. ప్రపంచమార్కెట్లోని పసిడి ధర నేటి ఆసియా ట్రేడింగ్‌లో 10డాలర్లు పెరిగింది. ఈ వారంలో పసిడికిది వరుసగా రెండోరోజూ లాభాల ర్యాలీ కావడం విశేషం. అయితే డాలర్‌ ఇండెక్స్‌ రెండేళ్ల గరిష్టాన్ని తాకడం పసిడి ర్యాలీకి కొద్దిమేర అడ్డుకుంటుంది. ఈ సెప్టెంబర్‌ 01 నుంచి చైనా దేశాల నుంచి దిగుమతి అవుతున్న టెలివిజన్లు, షూ లపై 15శాతం అదనపు

అమ్మకాల క్షీణతతో ఆటో షేర్ల రివర్స్‌ గేర్‌..!

Tuesday 3rd September 2019

అగస్ట్‌లో వాహనరంగ అమ్మకాలు భారీగా పడిపోవడంతో అటోరంగ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. క్రితం నెలలో అమ్మకాలు భారీగా తగ్గుముఖం పట్టడం, పలు బ్రోకరేజ్‌ సంస్థలు అటోరంగ షేర్లపై రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 2శాతం నష్టపోయింది. శనివారం పలు అటోరంగ కంపెనీలు ఆగస్ట్ మాసపు అమ్మకాలు

Most from this category