News


భారీగా పెరిగిన యుఎస్‌ నిల్వలు..నష్టాల్లో చమురు

Thursday 17th October 2019
Markets_main1571287529.png-28943

యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పెరగడంతో అంతర్జాతీయ చమురు డిమాండ్‌ ఆందోళనలు మరింత పెరిగాయి. ఫలితంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.59 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.67 శాతం నష్టపోయి బారెల్‌ 59.02 డాలర్ల వద్ద, డబ్యూటీ క్రూడ్‌ 0.79 శాతం నష్టపోయి బారెల్‌ 52.94 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అక్టోబర్‌ 11తో ముగిసిన వారానికిగాను యుఎస్‌ చమురు నిల్వలు 10.5 మిలియన్‌ బారెళ్లు పెరిగి 432.5 మిలియన్‌ బారెళ్లకు చేరుకుందని అమెరికన్‌ పెట్రోలియం ఇనిస్టిట్యూట్‌ డేటా బుధవారం ప్రకటించింది. కాగా దీనిపై ప్రభుత్వ అధికారిక డేటా గురువారం వెలువడనుంది. యుఎస్‌ క్రూడ్‌ నిల్వలు 2.8 మిలియన్‌ బారెళ్లు పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేయడం గమనార్హం. ‘అధికంగా చమురు డిమాండ్‌ దృక్పథంపై దృష్ఠి పెట్టిన ప్రస్తుత పరిస్థితులలో యుఎస్‌ చమురు నిల్వలు భారీగా పెరగడంతో చమురు ధరలు పడిపోతున్నాయి’ అని యాక్సిట్రేడర్‌, ఆసియా పసిఫిక్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ స్టీఫెన్‌ ఇన్నెస్‌ అన్నారు. యుఎస్‌ ప్రభుత్వ అధికారిక డేటా కూడా దీనిని సమర్ధిస్తే ఇది 2017 ఫిబ్రవరి తర్వాత అత్యధిక పెరుగుదల కానుందని అన్నారు. వీటితో పాటు యుఎస్‌ రిటైల్‌ అమ్మకాలు సెప్టెంబర్‌ నెలలో పడిపోవడంతో అంతార్జతీయంగా చమురు డిమాండ్‌పై ఆందోళనలు పెరిగాయి. 



You may be interested

స్థిరంగా పసిడి

Thursday 17th October 2019

అమెరికా రిటైల్‌ అమ్మకాల గణాంకాలు బలహీనంగా నమోదు కావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల స్వల్ప నష్టంతో 1,492.05 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నిన్నరాత్రి సెప్టెంబర్‌ రిటైల్‌ గణాంకాలను విడుదల చేసింది. ధీర్ఘకాలంగా చైనాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధం అమెరికా తయారీ రంగంపై ప్రభావాన్ని చూపడంతో 7నెలల్లో తొలిసారిగా తగ్గుముఖం పట్టాయి. బలహీన రీటైల్‌

71.20-71.80 శ్రేణిలో రూపీ

Thursday 17th October 2019

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం 5 పైసలు బలపడి 71.38 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ముగియడంతో పాటు, చమురు ధరలు తగ్గడంతో రూపీ డాలర్‌ మారకంలో కనిష్ఠ స్థాయి నుంచి 11 పైసలు బలపడి 71.43 వద్ద ముగిసింది. రూపీ-డాలర్‌ జంటకు గరిష్ఠ స్థాయిల వద్ద సరఫరా ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని, దీనిని షార్ట్‌ పొజిషన్‌లు తీసుకోడానికి

Most from this category