News


చమురు లాభాలకు బ్రేక్‌!

Thursday 29th August 2019
Markets_main1567052553.png-28080

శాన్ఫ్రాన్సిస్కో ఫెడరల్ రిజర్వ్ ప్రెసిడెంట్ మేరీ డాలీ యుఎస్‌ ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో గురువారం ట్రేడింగ్‌లో  చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్‌ 30 సెంట్లు లేదా 0.5 శాతం తగ్గి బ్యారెల్ 60.19 డాలర్లకు చేరుకోగా, డబ్యూటీఐ క్రూడ్‌ 15 సెంట్లు లేదా 0.3 శాతం తగ్గి 55.63 డాలర్లకు పడిపోయింది. కాగా గత సెషన్‌లో చమురు ధరలు 1.5 శాతం పెరగడం గమనార్హం. యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనలు, చమురు డిమాండ్‌ క్షీణించడంపై ఆందోళనలు పెరిగాయి. 
   అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలమైన పురోగతి ఉందని అయితే ట్రేడ్‌ వార్‌ అనిశ్చితి, ప్రపంచ వృద్ధి మందగమనం ప్రభావం యుఎస్‌ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని డాలీ గురువారం అన్నారు. యుఎస్‌ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికి ఇంకోసారి వడ్డీ రేట్ల కోత అవసరాన్ని అంచనా వేయడంలో వేచిచూసే ధోరణిలో ఉన్నానని, విలేకరులతో డాలీ చెప్పారు.
   వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం పట్ల చైనా చిత్తశుద్ధితో ఉందని తాను విశ్వసిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అన్నారు. కానీ వాణిజ్యంపై ఇరు దేశాల మధ్య టెలిఫోన్ కాల్‌ను ధృవీకరించడానికి చైనా విదేశాంగ శాఖ నిరాకరించడంతో మంగళవారం ఆందోళనలు మళ్లీ పెరిగాయి. ‘వాణిజ్య ఉద్రిక్తతలు చమురు ధరలపై అధికంగా ప్రభావం చూపుతోంది’ అని ఓండా సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు జెఫ్రీ హాలీ అన్నారు. గత వారం యుఎస్‌ ఇన్వెంటరీలలో 21 లక్షల బారెల్స్ తగ్గుదల ఉంటుందని విశ్లేషకుల అంచనా వేయగా, 100 లక్షల బారెల్స్‌గా నమోదయ్యిందని ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఈఐఏ) తెలిపింది. అంతేకాకుండా  గ్యాసోలిన్‌ నిల్వలు 3, 88,000 బ్యారెల్ తగ్గుతాయని విశ్లేషకుల అంచనా వేయగా, అది 21 లక్షల బారెల్స్ తగ్గాయని నివేదించింది.



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 29th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం​ ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఇండిగో:- కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా మలేవీటిల్‌ దామోదరన్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అనిల్‌  పరాషర్ నియమితులయ్యారు.  పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- సుమారు రూ.3000వేల కోట్ల విలువైన ఎన్‌సీడీల చెల్లింపుల తేదీని వాయిదావేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌:- ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1.5లక్షల కోట్ల విలువైన ఎన్‌సీడీల జారీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఎల్‌అండ్‌టీఫైనాన్స్‌ హోల్డింగ్స్‌:- కంపెనీ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ వ్యాపారాన్ని విభాగాన్ని ఐఐఎఫ్‌ఎల్‌

71.90 వద్ద రూపీ ప్రారంభం

Thursday 29th August 2019

 దేశియ రూపీ డాలర్‌ మారకంలో 14 పైసలు బలహీనపడి గురువారం 71.90 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్య భయాలు పెరగడంతో ఇన్వెస్టర్లు జపనీస్‌ యెన్‌ వంటి సురక్షితమైన ఆస్తుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 29 పైసలు బలహీనపడి 71.77 వద్ద ముగిసింది.  గత సెషన్‌లో డాలర్‌-రూపీ సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ 72.04 గా ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 16.52 శాతం పెరిగిందని ఐసీఐసీఐ

Most from this category