News


పెరిగిన యుఎస్‌ చమురు నిల్వలు..తగ్గిన చమురు

Thursday 5th September 2019
Markets_main1567656988.png-28206

గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు పెరగడంతో గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.3 శాతం పడిపోయి బారెల్‌ 60.52 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.4 శాతం తగ్గి బారెల్‌ 56.03 డాలర్లకు చేరుకున్నాయి. అగష్టు 30 తో ముగిసిన వారానికిగాను యుఎస్‌ చమురు నిల్వలు తగ్గుతాయని విశ్లేషకులు అంచనాల నేపథ్యంలో, గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 4.2 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 4.3 శాతం లాభపడ్డాయి. కానీ ఆశ్చర్యకరంగా యుఎస్‌ చమురు నిల్వలు పెరిగాయని ఇండస్ట్రీ నివేదిక వెలువడడంతో గురువారం చమురు ధరలు తగ్గాయి. ‘గత వారం యుఎస్ క్రూడ్‌ నిల్వలు పెరిగాయి. కానీ గ్యాసోలిన్ నిల్వలు తగ్గాయి’ అని అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ (ఎపీఐ) బుధవారం తెలిపింది. ఆగస్టు 30 తో ముగిసిన వారంలో క్రూడ్‌ నిల్వలు 401,000 బారెల్స్ పెరిగి 4,291 లక్షల బారెల్స్‌కు చేరుకుంది. కాగా ఈ నిల్వలు 25 లక్షల బారెల్స్ తగ్గుతాయని విశ్లేషకుల అంచనా వేశారు.
  దీంతోపాటు కొత్త ఆర్డర్లు పెరగడంతో గత మూడు నెలల్లో వేగంగా, అగష్టులో చైనా సేవల రంగంలో కార్యకలాపాలు విస్తరించాయని ఒక సర్వే తెలపడంతో బుధవారం చమురు ధరలు పెరిగాయి. చైనా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చమురు వినియోగ, అతిపెద్ద దిగుమతిదారు కావడంతో చైనా వృద్ధి చమురు ధరలకు పాజిటివ్‌గా ఉంది. యుఎస్‌- చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను మందగమనంలోకి నెడుతుండడంతో చమురు డిమాండ్ వృద్ధి అంచనాలను విశ్లేషకులు తగ్గించారు. ‘వినియోగం మందగించడంతో ప్రపంచ చమురు డిమాండ్ 2019 లో రోజుకు 10 లక్షల బ్యారెళ్ల కంటే తక్కువగా పెరుగుతుంది’ అని బీపీ పీఎల్‌సీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రియాన్ గిల్వారీ రాయిటర్స్‌తో అన్నారు. దీంతో పాటు తాను రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే చైనాపై కఠినంగా వ్యవహరిస్తానని వ్యాఖ్యానించడంతో అమెరికా మాంద్యం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశం కూడా చమురు ధరలను ప్రభావితం చేస్తోంది. 



You may be interested

లాభాల్లో కోల్‌ ఇండియా, టాటాస్టీల్‌, వేదాంత

Thursday 5th September 2019

యుఎస్- చైనా ఇరు దేశాల అధ్యక్షులు  ఉదయం ఫోన్‌లో మాట్లాడారని, అంతేకాకుండా అక్టోబర్ ప్రారంభంలో మరో రౌండ్ వాణిజ్య చర్చల కోసం సమావేశానికి అంగీకరించారని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. దీంతోపాటు దేశియ బెంచమార్క్‌ సూచీలు కూడా సానుకూలంగా ట్రేడవుతుండడంతో ఉదయం 9.55 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.38 శాతం లాభపడి 2,308.30 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 5th September 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఎంసీఎక్స్‌ ఇండియా:- షాంగ్యూ కమోడిటీ ఎక్చ్సేంజీతో ఎంఓయూ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. విప్రో లిమిటెడ్‌:- ఐసీఐసీఐ బ్యాంక్‌కు 7ఏళ్లపాటు సాంకేతిక సేవలు అందించడానికి 300 మిలియన్ డాలర్ల విలువైన వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  శంకర బిల్డింగ్‌ ప్రాడెక్ట్స్‌ లిమిటెడ్‌:- ఇండియా రేటింగ్స్‌ సంస్థ కంపెనీ రేటింగ్‌ను ఇండియాఎ(-)కు, నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించింది. ఐసీఐసీఐ లాంబార్డ్‌:- సాండర్డ్‌ ఛార్టెడ్‌ బ్యాంక్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఉషా మార్టిన్‌ ఎడ్యూకేషన్‌:- కంపెనీ

Most from this category