అంతర్జాతీయ మందగమనం..తగ్గిన చమురు
By Sakshi

యుఎస్-చైనా ట్రేడ్ వార్ తీవ్రమవ్వడంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెలుతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా చమురు ధరలు సోమవారం ట్రేడింగ్‌లో నష్టపోయాయి. బ్రెంట్ క్రూడ్ 1.5 శాతం క్షీణించి బారెల్ 58.45 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్యూటీఐ క్రూడ్ 1.8 శాతం నష్టపోయి బారెల్ 53.17 డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమన భయాలు, యుఎస్ ఆర్థిక మాంద్య భయాలు చమురు మార్కెట్లను వెంటాడుతున్నాయని వలోర్ మార్కెట్స్ మానేజింగ్ పార్టనర్ స్టీపెన్ ఇన్నెస్ అన్నారు.
యునైటెడ్ స్టేట్స్, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవ్వడంతో ఆర్థిక మందగమన ఆందోళనలు పెరుగుతున్నాయి. కాగా ముడి చమురు, సోయాబీన్స్ వంటి వ్యవసాయ ఉత్పత్తులు, చిన్న విమానాలతో సహా యుఎస్ నుంచి దిగుమతి చేసుకుంటున్న 5,078 ఉత్పత్తులపై 5 శాతం లేదా 10 శాతం అదనపు సుంకాలను విధించనున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో కార్యకలాపాలను మూసివేసి, అమెరికాలో ఉత్పత్తులను తయారు చేసే మార్గాలను పరిశీలించాలని అమెరికా కంపెనీలను కోరిన విషయం తెలిసిందే.
దీనితో పాటు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్, వ్యోమింగ్‌లోని జాక్సన్ హోల్లోని వార్షిక ఆర్థిక సింపోజియంలో మాట్లాడుతూ... అమెరికా ఆర్థిక వ్యవస్థ అనుకూలంగానే ఉందని, ప్రస్తుత ఆర్థిక విస్తరణను ట్రాక్ చేయడానికి ఫెడరల్ రిజర్వ్ ‘తగిన విధంగా’ పనిచేస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు సెంట్రల్ బ్యాంక్ తన తదుపరి సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టతనివ్వలేదు. ఈ అంశం ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తోంది. అంతేకాకుండా యుఎస్ మాంద్యం అవకాశంపై ఆందోళనను పెంచుతూ, యుఎస్ ఉత్పాదక పరిశ్రమలు దాదాపు ఒక దశాబ్దంలో తమ మొదటి నెల తగ్గుదలను నమోదు చేశాయి. ఈ అంశం కూడా చమురును ప్రభావితం చేస్తోంది. కొత్త ఇంధన డ్రిల్లింగ్‌పై ఖర్చులను నిర్మాతలు తగ్గించడంతో, యుఎస్ ఇంధన సంస్థలు ఈ వారంలో దాదాపు నాలుగు నెలల్లో అత్యధిక చమురు రిగ్‌లను తగ్గించాయి. కాగా ఈ రిగ్‌ల లెక్కింపు జనవరి 2018 తర్వాత కనిష్టానికి పడిపోవడం గమనార్హం.
You may be interested
జైట్లీ.. సంస్కరణల జమాజెట్టీ!
Monday 26th August 2019- కూలబడ్డ స్థాయి నుంచి పరుగుల దిశగా సంస్కరణలు - జీఎస్టీ అమలు చేయటమే అతిపెద్ద విజయం - దివాలా చట్టంతో బ్యాంకులకు ఊరట ఒకపక్క స్కాముల కంపు కొడుతున్న వ్యవస్థ, మరోపక్క దిగజారిన విదేశీ నిధులు!!. ఇటు చూస్తే ద్రవ్య లోటు పెరుగుదల... అటు చూస్తే రెండంకెల ద్రవ్యోల్బణం!!. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎకనమిస్టుకైనా సంస్కరణలు అమలు కత్తిమీద సామే. కానీ ఈ రాజకీయ లాయర్‌కు మాత్రం అది ఒక సంక్లిష్టమైన
రాబడుల్లో ‘డైనమిక్’
Monday 26th August 2019ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆల్ సీజన్స్ బాండ్ లాంగ్ డురేషన్ గిల్ట్ ఫండ్స్ ఈ ఏడాది ఇప్పటి వరకు మంచి ర్యాలీ చేశాయి. పదేళ్ల జీసెక్ ఈల్డ్స్ 80-90 బేసిస్ పాయింట్ల మేర పడిపోవడం గిల్ట్ ఫండ్స్ రాబడులకు దారితీసింది. అయితే, జూలై నెలలో 60 బేసిస్ పాయింట్ల వరకు ర్యాలీ చేసిన తర్వాత గత వారంలో పదేళ్ల జీసెక్ ఈల్డ్స్ తిరిగి స్వల్పంగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటుపై నెలకొన్న ఆందోళనలే