News


డిమాండ్‌ ఆందోళనలు.. నష్టాల్లో చమురు

Monday 21st October 2019
Markets_main1571633956.png-29026

   చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతోపాటు, రష్యా సెప్టెంబర్‌ నెలలో నిర్దేశించుకున్న లక్ష్యం కన్నా అధికంగా చమురును ఉత్పత్తి చేయడంతో చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.25 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.30 శాతం నష్టపోయి బారెల్‌ 59.24 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.15 శాతం నష్టపోయి బ్యారెల్‌ 53.79 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. 
  ‘చైనా ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతో కమోడిటీ మార్కెట్‌ నష్టాల్లో ట్రేడవుతోంది’ అని ఏఎన్‌జెడ్‌ బ్యాంక్‌ ఓ నివేదికలో పేర్కొంది. మూడవ త్రైమాసికానికి సంబంధించి చైనా ఆర్థిక డేటా ఏడాది ప్రాతిపదికన 6 శాతంగా నమోదైంది. ఇది 27-1/2 ఏళ్ల కంటే కనిష్ఠాస్థాయి కావడం గమనార్హం. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో పాటు, యుఎస్‌-చైనా వాణిజ్య ఒత్తిళ్ల వలన చైనా ఆర్థికవ్యవస్థ మందగించింది. అయినప్పటికి చైనా రిఫైనరీల పనితీరు ఏడాది ప్రాతిపదికన 9.4 శాతం పెరిగింది. ఇది సెప్టెంబర్‌ నెలలో చైనాలో ఆయిల్‌ డిమాండ్‌ పెరిగిందనే సంకేతాలను ఇస్తుందని విశ్లేషకులు తెలిపారు. 
  మరోవైపు రష్యా సెప్టెంబర్‌ నెలలో ఒప్పందం కంటే అధికంగా చమురును ఉత్పత్తి చేసింది. శీతాకాలం కోసం దేశం సిద్ధమవుతున్నందున గ్యాస్ కండెన్సేట్ ఉత్పత్తిని పెంచడంలో భాగంగా, చమురు ఉత్పత్తి కూడా ఊహించని దానికంటే అధికంగా పెరిగిందని రష్యా ఆదివారం ప్రకటించింది. కాగా ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు), ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తిలో రోజుకు 12 లక్షల బారెళ్ల కోతను విధించేందుకు గత ఏడాది డిసెంబర్‌లో అంగీకరించిన విషయం తెలిసిందే. వీటితో పాటు ఒపెక్‌ దేశాలయిన కువైట్‌, సౌదీ అరేబియా కలిసి న్యూట్రల్‌ జోన్‌లో రోజుకు 500,000 బారెల్స్‌ ఉత్పత్తిని ప్రారంభించడానికి అంగీకరించడంతో చమురు మార్కెట్‌లో సరఫరా ఆందోళనలు పెరిగాయి. ‘చమురు మార్కెట్‌లు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ అదనపు ఉత్పత్తి వస్తుంది’ అని యాక్సిట్రేడర్‌, మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ స్టీఫెన్‌ ఇన్నెస్‌ అన్నారు. 



You may be interested

తీవ్ర హెచ్చుతగ్గులతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Monday 21st October 2019

ఇక్కడ నిఫ్టీ- ఫ్యూచర్స్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ ఇండెక్స్‌ సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఈ ఇండెక్స్‌ నేడు.... కిత్రంరోజు ముగిసిన నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపు(11670.00)తో పోలిస్తే ఒక దశలో 50 పాయింట్లు లాభపడి 11720.00 స్థాయికి ఎగిసింది. అనంతరం లాభాలను కోల్పోయి నష్టాల్లోకి మళ్లి, 11,652 పాయింట్ల వద్దకు పడిపోయింది.  ఉదయం 10:40 గంటలకు నిఫ్టీ ఫ్యూచర్‌ ముగింపుతో పోలిస్తే 10 పాయింట్ల నష్టంతో 11,660 వద్ద ట్రేడ్‌ అవుతోంది.   మిశ్రమంగా ట్రేడ్‌

ఈ స్టాక్స్‌ కొనొచ్చు

Monday 21st October 2019

బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌  ఏసీసీ:    కొనచ్చు; ప్రస్తుత ధర: రూ.1,553; టార్గెట్‌ ధర: రూ.1,900 ఎందుకంటే: ఈ సిమెంట్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. నిర్వహణ పనితీరు అంచనాలకు అనుగుణంగానే ఉండగా, వ్యయాలు అంచనాలను మించి పెరగడంతో నికర లాభం అంచనాలను అందుకోలేకపోయింది. ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.3,464 కోట్లకు పెరిగింది. వర్షాలు ఎక్కువ కాలం కురియడం, బలహీన ఆర్థిక పరిస్థితుల కారణంగా

Most from this category