News


పడిపోయిన చమురు

Thursday 1st August 2019
Markets_main1564636268.png-27463

యుఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల కోత మరింతగా ఉండదనే స్పష్టమైన సంకేతాలను ఇవ్వడంతో పాటు, యుఎస్‌-చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చలలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో గురువారం చమురు ధరలు ఒక డాలర్‌ మేర పడిపోయాయి.యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే ఎక్కువగా పడిపోవడంతో పాటు, ఒపెక్‌ దేశాలలో​చమురు ఉత్పత్తి తగ్గడం, లిబియా ఎగుమతులను తగ్గించడం తదితర సానుకూల అంశాలున్నప్పటికీ, క్రూడ్‌ ధరలు తగ్గాయి. బ్రెంచ్‌ మార్క్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.6 శాతం లేదా 1.06 డాలర్లు తగ్గి బ్యారెల్‌కు 63.99 డాలర్లకు, డబ్యూటీ క్రూడ్‌ 1.6 శాతం లేదా 93 సెంట్లు తగ్గి బ్యారెల్‌కు 57.65 డాలర్లకు  పడిపోయాయి. ‘యు.ఎస్. జాబితా నివేదికలు చమురు మార్కెట్లకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నప్పటికి  ఫెడ్‌ రేట్ల కోత కొనసాగదనే సంకేతాలు స్పష్టంగా ఇవ్వడంతో చమురు ధరలు క్షీణించాయి’ అని విఎం మార్కెట్స్ పిటిఈ మేనేజింగ్ భాగస్వామి స్టీఫెన్ ఇన్నెస్ ఒక నోట్‌లో పేర్కొన్నారు. 
   ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన యునైటెడ్ స్టేట్స్, చైనా మధ్య జరిగిన మొదటి రౌండ్‌ వాణిజ్య  చర్చలలో ఎటువంటి పురోగతి సంకేతాలు లేకుండా  బుధవారం ముగిశాయి.అంతేకాకుండా తదుపరి సమావేశాన్ని సెప్టెంబర్ వరకు నిలిపివేశారు.

 



You may be interested

ఐఓసీ లాభం 47 శాతం డౌన్‌

Thursday 1st August 2019

తగ్గిన జీఆర్‌ఎమ్‌ ఇన్వెంటరీ లాభాలు కూడా తగ్గుముఖం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 47 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.7,092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.3,738 కోట్లకు తగ్గిందని ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. ఒక్కో షేర్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.7.48 నుంచి రూ.4.07కు తగ్గిందని

పసిడికి ఫెడ్‌ రేట్ల కోత కష్టాలు

Thursday 1st August 2019

2వారాల కనిష్టానికి పసిడి ధర మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లు ఫెడ్‌ వడ్డీరేట్లపై పావుశాతం కోత విధించడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు 2వారాల కనిష్టానికి పతనమయ్యాయి. నిన్నరాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంకు 11 ఏళ్ల తరువాత కీలక వడ్డీరేట్లపై పావుశాతం కోత విధించింది. తాజా తగ్గింపుతో ఫెడ్‌ రేటు 2.25-2శాతానికి చేరుకుంది. ప్రపంచ ఆర్థిక ఆర్థిక వ్యవస్థ మందగమన ఆందోళనలు, యూఎస్‌ ద్రవ్యోల్బణం నీరసించిన నేపథ్యంలో వడ్డీరేట్లపై కోత విధింస్తున్న ఫెడ్‌

Most from this category