News


రెండో రోజు తగ్గిన ఆయిల్‌ ధరలు

Tuesday 18th June 2019
Markets_main1560833230.png-26364

వరుసగా రెండో రోజు కూడా చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.3శాతం నష్టపోయి బ్యారెల్‌ 60.78డాలర్ల వద్ద, డబ్యుడీఐ క్రూడ్‌ 0.2శాతం నష్టపోయి బ్యారెల్‌ 51.92 డాలర్ల వద్ద  మంగళవారం ట్రేడవుతున్నాయి. యూఎస్‌ -చైనా ట్రేడ్‌వార్‌ భయాలు, గత వారం ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడి కారణంగా మిడిల్‌ ఈస్ట్‌ దేశాలలో చెలరేగిన ఒత్తిడి వలన చమురు ధరలు తగ్గాయి. గత సెషన్‌లో  బ్రెంట్‌ క్రూడ్‌ 1.7 శాతం, డబ్యుటీఐ క్రూడ్‌ 1,1 శాతం నష్టపోయిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌ రాష్ట్ర వ్యాపార వృద్ధి గత రెండున్నర సంవత్సరాల కంటే దిగువకు పడిపోయిందని, ఇది అక్కడి కార్యకలాపాలలో సంకోచాన్ని సూచిస్తుందని సోమవారం ది న్యూయార్క్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ తెలిపింది.  ట్రేడ్‌ వార్‌ భయాల నేపథ్యంలో యూఎస్‌ వ్యాపారం సెంటిమెంట్‌ బలహీనపడింది.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడం, ట్రేడ్‌ వార్‌ భయాల కారణంగా 2019 ఏప్రిల్‌లోని గరిష్ఠ స్థాయిలో  20శాతం కోల్పోయి ఆయిల్‌ ట్రేడవుతోంది. ఇరాన్‌ , అమెరికా దేశాల మధ్య ఉన్న ఘర్షణ వాతవరణం కూడా ఆయిల్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి.



You may be interested

నష్టాల్లో ఎస్‌బీఐ, ఫెడరల్‌,బీఓబీ,ఐడీఎఫ్‌సీ, యస్‌బ్యాం‍క్‌ షేర్లు

Tuesday 18th June 2019

 బ్యాంక్‌ షేర్లు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్‌బీఐ 1.07 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 0.66శాతం, ఐడీఎఫ్‌సీ 0.48శాతం నష్టపోగా బీఓబీ 0.30 శాతం, యస్‌ బ్యాంక్‌ 0.26 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.08శాతం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 0.07శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి.  ఉదయం 10.45 సమయానికి బెంచ్‌మార్క్‌ సూచీ నిఫ్టీ50 ఇండెక్స్‌ 19.90 పాయింట్లు లాభపడి 11692.10 వద్ద, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 88.53 పాయింట్లు లాభపడి 39049.32 వద్ద ట్రేడవుతున్నాయి. నిఫ్టి

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 18th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ఎన్‌సీడీలపై చెల్లించిన రూ.56.8 కోట్ల రుణాన్ని చెల్లించినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. రెప్కో ఇండియా:- తన అనుబంధ సంస్థ రెప్కో ఇన్నోవేషన్‌ డిజి ప్రింట్‌ లిమిటెడ్‌ విభజనకు డ్రాఫ్ట్‌ స్కీంకు బోర్డు ఆమోదం తెలిపింది. బినాని ఇండస్ట్రీస్‌:- కంపెనీ స్వతం‍త్ర డైరెక్టర్‌ పదవికి రతన్‌ కుమార్‌ సరవాగీ రాజీనామా చేశారు. కాక్స్‌ అండ్‌ కింగ్స్‌:- కంపెనీ ఇటీవల జారీ చేసిన రూ.375 కోట్ల కమర్షియల్‌

Most from this category