News


58 డాలర్ల దిగువకు క్రూడ్‌ ఆయిల్‌!

Thursday 3rd October 2019
Markets_main1570077369.png-28690

యుఎస్‌ స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతో చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. దీనికితోడు గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే పెరిగాయని ఎనర్జి ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ బుధవారం ప్రకటించడంతో గురువారం చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.3 శాతం నష్టపోయి బారెల్‌ 57.52 డాలర్లకు చేరుకోగా, డబ్యూటీ క్రూడ్‌ 0.2 శాతం నష్టపోయి బారెల్‌ 52.55 డాలర్లకు పడిపోయింది. గత సెషన్‌లో పాజిటివ్‌గా ప్రారంభమైన బ్రెంట్‌ క్రూడ్‌ 2 శాతం నష్టపోయి 58 డాలర్ల స్థాయి దిగువన ముగిసింది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ కూడా 1.8 శాతం నష్టపోయి 53 డాలర్ల స్థాయి దిగువకు చేరుకుంది. 
   ‘చమురు డిమాండ్‌ దృక్పథంపై ఉన్న సానుకూల అంశాలు, బలహీనమైన యుఎస్‌ ఆర్థిక డేటా వలన కనుమరుగవతున్నాయి’ అని  ఎస్‌పీఐ ఎసెట్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌, స్టీఫెన్‌ ఇన్నెస్‌ అన్నారు. యుఎస్‌ ఆర్థిక వృద్ధి బలహీనపడడంతోపాటు, యూరోప్‌లో కార్పోరేట్‌ లాభాల వృద్ధి తగ్గడంతో యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను మాంధ్యంలోకి నెడుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్‌లో చాలా వరకు అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ సూచీలు వాటి నెల కనిష్ఠాలకు పడిపోయాయి. ‘యుఎస్‌-చైనా ప్రతినిధుల మధ్య జరగనున్న వాణిజ్య చర్చలు చమురు ధరలకు కొంత మద్ధతుగా ఉండే అవకాశం ఉంది’ అని ఇన్నెస్‌ అభిప్రాయపడ్డారు. 
   వీటితో పాటు గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు 31 లక్షల బారెల్స్‌ పెరిగాయని బుధవారం యుఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిష్ట్రేసన్‌ బుధవారం ప్రకటించింది. ఫలితంగా కూడా చమురు ధరలు పడిపోయాయి. సౌదీ చమురు కేంద్రాలపై సెప్టెంబర్‌ 14న డ్రోన్‌ దాడి జరిగిన తర్వాత చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ ప్రస్తుతం డిమాండ్‌ ఆందోళనలు పెరగడంతో ఈ దాడికి ముందు ఉన్న స్థాయిల కంటే దిగువకు బ్రెంట్‌ క్రూడ్‌ పడిపోవడం గమనార్హం. ‘బలహీన ఆర్థిక డేటా చమురు డిమాండ్‌పై ప్రభావం చూపుతోంది. దీనికి తోడు చమురు సరఫరా అంశాలు కూడా చమురు ధరలను కిందికి లాగుతున్నాయి’ అని ఏఎన్‌జెడ్‌ బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది.



You may be interested

మళ్లీ 1500డాలర్ల పైకి పసిడి

Thursday 3rd October 2019

మూడు సెషన్ల తర్వాత పసిడి ఫ్యూచర్ల ధర మళ్లీ 1500 డాలర్ల స్థాయి అందుకుంది. అమెరికాలో నమోదైన బలహీన ఆర్థిక గణాంకాలు ఆ దేశ ఈక్విటీ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. అలాగే అమెరికా తాజాగా యూరప్‌ దేశాల దిగుమతులపై తాజా సుంకాల విధింపుతో వాణిజ్య వివాదాలకు తెరలేపింది. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక సాధనమైన పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా నిన్నరాత్రి అక్కడి మార్కెట్‌లో

కార్పొరేట్‌ పన్ను కోత సంస్కరణల దిశగా సంకేతం

Thursday 3rd October 2019

హైదరాబాద్‌: కార్పొరేట్‌ పన్ను తగ్గింపు అన్నది నిర్మాణాత్మక సంస్కరణల దిశగా ప్రభుత్వం ఇచ్చిన సంకేతమని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ అన్నారు. రెవెన్యూలోటును పూడ్చుకునేందుకు పన్నేతర ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వృద్ధి రేటు తగ్గినందున జీఎస్‌టీ వసూళ్లు కూడా తగ్గుతాయని అంచనా వేసిందేనన్నారు. సెప్టెంబర్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.91వేల కోట్లకు తగ్గిపోయిన విషయం గమనార్హం. హైదరాబాద్‌లో బుధవారం

Most from this category