News


పెరిగిన చమురు ధరలు..

Friday 21st June 2019
Markets_main1561091954.png-26458

పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతలే కారణం
కొన్నిసెషన్లుగా అప్‌మూవ్‌లో ఉన్న చమురు ధరలు శుక్రవారం కూడా పెరిగాయి. ఫెడ్‌ వడ్డిరేట్ల తగ్గింపు భవిష్యత్‌లో ఉంటుందనే సంకేతాలివ్వడంతో పాటు అమెరికా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేసిందనే వార్తల నేపథ్యం, మిడిల్‌ ఈస్ట్‌ దేశాలలో పెరిగిన అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరిగాయి. శుక్రవారం బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.6 శాతం పెరిగి బ్యారెల్‌కు 64.84డాలర్ల వద్ద , డబ్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.6 శాతం పెరిగి 57.39డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా-చైనా మధ్య చర్చలు జరగనున్నాయని, ఫెడ్‌ వడ్డి రేట్ల తగ్గింపు వలన ఆర్థికంగా వృద్ధి పెరుగుతుందనే నేపథ్యంలో చమురుకు పెరిగిన డిమాండ్‌ కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెప్పొచ్చు. దీంతో పాటు డాలర్‌ బలహీనపడడంతో కూడా చమురు ధరలు పెరిగాయి.  ఈ ఏడాది ఏప్రిల్‌లో చమురు ధరలు గరిష్ఠంగా 75 డాలర్లను తాకగా ట్రేడ్‌ వార్‌ భయాల కారణంగా అప్పటి నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 21st June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఎన్‌టీపీసీ:- ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 160 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్‌ ప్రాజెక్ట్‌ను దక్కిచుకుంది. అలాగే 750 మెగావాట్ల ప్రాజెక్ట్‌ కొరకు టెండర్‌ను ధాఖలు చేసింది. ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌:- కంపెనీ రుణ సమీకరణ పరిమితులపై క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ ధీర్ఘకాలికానికి ఎఎ-(స్థిరత్వం) రేటింగ్‌ను. స్వల్పకాలికానికి ఎ1(+) రేటింగ్‌ కేటాయించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌:- ఎస్‌బీఐ ఆధ్వర్యంలోనిక బ్యాంకుల కూటమి ధాఖలు

31 పైసలు బలహీనపడిన రూపీ

Friday 21st June 2019

డాలర్‌ మారకంలో రూపీ శుక్రవారం(జూన్‌ 21) 31పైసలు బలహీనపడి 69.75వద్ధ ప్రారంభమైం‍ది. దేశియ కారణాలు కాకుండా అంతర్జాతీయ కారణాల వలన రూపీ బలహీన పడింది. వచ్చే వారంలో జరగనున్న జీ20 సమావేశంలో యూఎస్‌-చైనా దేశాల మధ్య చర్చలపై పెట్టుబడిదారులు దృష్ఠి సారించనున్నారు.ఫెడ్‌ వడ్డి రేట్లను యదాతథంగా కొనసాగించినప్పటికి భవిష్యత్‌లో రేట్ల తగ్గింపు​ఉంటుందనే సంకేతాలు ఇవ్వడం, దేశియ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో గురువారం రూపీ  24పైసలు బలపడి రూ.69.44 వద్ద ముగిసింది.

Most from this category