News


స్వల్పంగా పెరిగిన చమురు

Tuesday 6th August 2019
Markets_main1565067222.png-27561

చమురు ధరులు మంగళవారం ట్రేడింగ్‌లో పెరిగినప్పటికి, అంతర్జాతీయ వాణిజ్య భయాల వలన చమురు డిమాండ్‌ ఆందోళనలు మదుపర్లను వెంటాడుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్ 10 సెంట్లు లేదా 0.17 శాతం పెరిగి బ్యారెల్కు  59.91 డాలర్లకు చేరుకుంది. అదేవిధంగా డబ్ల్యుటిఐ క్రూడ్‌ ఫ్యూచర్స్ 7 సెంట్లు లేదా 0.13 శాతం పెరిగి బ్యారెల్కు 54.76 డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద చమురు వినియోగదారుల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు వలన చమురు డిమాండ్‌ ఆందోళన నేపథ్యంలో బ్రెంట్‌ క్రూడ్‌ గత సెషన్‌లో 3 శాతానికి పైగా పడిపోయి జనవరి మధ్యకాల కనిష్టం, 59.07 డాలర్లకు పతనమయిన విషయం తెలిసిందే. ట్రేడ్‌ వార్‌లో భాగంగా చైనా తన కరెన్సీ విలువను తగ్గించుకోవడంతో పాటు యుఎస్‌ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలును పరిమితం చేయడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం సన్నగిల్లుతుందని న్యూయార్క్‌లోని ఓండా సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు ఎడ్వర్డ్ మోయా అన్నారు. ‘చమురు మార్కెట్లు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలను విస్మరిస్తున్నాయి. ఇప్పటికి పెర్షియన్ గల్ఫ్‌లో పరిస్థితి అస్థిరంగా ఉంది. దీనికితోడు యుఎస్‌ చమురు నిల్వలు క్షీణత కొనసాగితే చమురు ధరలకు మద్ధతు లభించే అవకాశం ఉంది’ అని వివరించారు. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఇకపై ‘సముద్ర నేరాలను’ సహించదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి సోమవారం చెప్పారు.



You may be interested

గరిష్టస్థాయి వద్దే పసిడి

Tuesday 6th August 2019

నిన్నటి ట్రేడింగ్‌లో ఆరేళ్ల గరిష్టానికి ఎగిసిన పసడి ధర మంగళవారం దాదాపు అదేస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో నేడు ఔన్స్‌ పసిడి 1474 డాలర్ల వద్ద కదులుతోంది. గతవారంలో చైనాకు దిగుమతి అవుతున్న 300బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై 10శాతం టారీఫ్‌లను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రికత్తలు మొదలయ్యాయి. ట్రంప్‌ ప్రకటనకు ప్రతిగా చైనా అమెరికా డాలర్‌ విలువను క్షీణింపజేసేందుకు తన కరెన్సీ విలువను

బ్యాంక్‌ నిప్టీ 1శాతం అప్‌

Tuesday 6th August 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఒకశాతం లాభపడింది. నిన్నటి రోజు భారీ పతనం నేపథ్యంలో నేడు మార్కెట్లో కొనుగోళ్లకు మద్దతు లభిస్తుంది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 27,518.50 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ రికవరీలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లు లాభపడుతుడంతో ఈ ఇండెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలోనే దాదాపు 1శాతం వరకు లాభపడి 27928.85 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

Most from this category