STOCKS

News


తగ్గిన చమురు

Tuesday 13th August 2019
Markets_main1565670396.png-27726

గత సెషన్లో(సోమవారం) స్వల్ప లాభాలను అందుకున్న చమురు, మంగళవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో  ట్రేడవుతోంది. అంతర్జాతీయ మందగమన ఆందోళనల వలన  ప్రధాన చమురు ఉత్పత్తిదారులు, చమురు సరఫరా కోతను కొనసాగించే అవకాశం ఉండడంతో గత సెషన్‌లో చమురు స్వల్పంగా లాభపడింది. అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్‌ ఫ్యూచర్స్ మంగళవారం  0.2 శాతం క్షీణించి బ్యారెల్కు  58.46 డాలర్లకు చేరుకుంది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 0.2 శాతం తగ్గి బ్యారెల్కు 54.81 డాలర్ల వద్దకు చేరుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద  ఐపీఓను ప్రారంభించాలనే ప్రణాళికలో భాగంగా సౌదీ అరేబియా ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా సౌదీ ఆరాంకో మూలధన వ్యయంలో 12 శాతం తగ్గుదల కనిపిస్తోందని, ఇది చమురు సరఫరా వృద్ధిపై ప్రభావం చూపనుందని ఏఎన్‌జీ బ్యాంక్‌ ఒక నోట్‌లో పేర్కొంది. చమురు డిమాండ్‌ ఆందోళనలను ఇది కొం‍త వరకు నిలువరించగలదని తెలిపింది. వీటితోపాటు కువైట్‌ తన సొంత చమురు ఉత్పత్తిని ఒప్పందం కుదుర్చుకున్న దాని కంటే తగ్గించుకోవడం కూడా చమురు ధరలకు మద్ధతుగా ఉండగలవు. కానీ పెరుగుతున్న యు.ఎస్. షేల్ ఆయిల్ ఉత్పత్తి ఈ దేశాల ప్రయత్నాలను పరిమితం చేస్తోంది.
   యుఎస్‌ ఏడు ప్రధాన షేల్ నిర్మాణాల నుంచి చమురు ఉత్పత్తి, సెప్టెంబరులో రోజుకు 85,000 బారెల్స్ (బీపీడీ) పెరిగి, రికార్డు స్థాయిలో 87.7 లక్షల బీపీడీలకు చేరుకుంటుందని యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. యుఎస్‌-చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య యుధ్దం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మందగమనంలోకి నెడుతోందని, ఫలితంగా చమురు డిమాండ్‌ తగ్గుతోందని విశ్లేషకులు తెలిపారు.You may be interested

ఆరంభలాభాలు ఆవిరి

Tuesday 13th August 2019

సూచీలు లాభాల ఆరంభాన్ని నిలుపుకోవడంతో విఫలమయ్యాయి. ఫలితంగా మార్కెట్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే లాభాల్లోకి నుంచి నష్టాల్లోకి మళ్లాయి. దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. సౌదీ అరామ్‌కో తో రూ. లక్ష కోట్ల పెట్టుబడి ఒప్పందం ప్రకటించడటంతో పాటు బడ్జెట్‌ ప్రతిపాదిపించిన సూపర్‌ రిచ్‌ పన్ను కేంద్ర ఎత్తివేయవచ్చనే అంచనాలతో నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 127 పాయింట్ల లాభంతో 37,755.16 పాయింట్ల వద్ద,  నిఫ్టీ

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 13th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు అలహదాబాద్‌ బ్యాంక్‌:- అన్ని రకాల వడ్డీరేట్లపై ఎంసీఎల్‌ఆర్‌ రేట్లను 15నుంచి 20శాతం తగ్గించింది.  ఐఆర్‌బీ ఇన్ఫ్రా:- తన అనుబంధ సంస్థ ముంబైలోని పూణే ప్రాజెక్ట్‌ను నిర్ణీత సమయం(ఆగస్ట్‌ 09)లో పూర్తి చేసినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. సింటెక్స్‌ ప్లాస్టిక్‌:- తన అనుబంధ సంస్థ సింటెక్స్‌ ఎన్‌పీ సీఎఎస్‌ సంస్థలో మొత్తం ఈక్విటీని వాటాను ఒక ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.

Most from this category