News


62 డాలర్ల వద్దకు చమురు

Thursday 19th September 2019
Markets_main1568869358.png-28429

ఈ నెల చివరి నాటికి చమురు ఉత్పత్తిని పూర్తిగి పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించడంతో చమురు గత రాత్రి ప్రపంచ మార్కెట్లో 62 డాలర్ల సమీపానికి పడిపోయింది.  గురువారం ఉదయం ట్రేడింగ్‌లో స్వల్పంగా లాభపడి ట్రేడవుతోంది. ఉదయం 10.06 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.03 శాతం లాభపడి బారెల్‌ 62.68 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.19 శాతం లాభపడి బారెల్‌ 58.15 డాలర్ల వద్ద​ట్రేడవుతున్నాయి. 
   ఈ నెల చివరి నాటికి పూర్తిగా చమురు ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని, వినియోగదారులకు పూర్తి స్థాయిలో చమురు సరఫరాను అందిస్తామని సౌదీప్రభుత్వం ప్రకటించిన తర్వాత చమురు ధరలు గత సెషన్‌లో 2 శాతం మేర పతనమయ్యాయి. సౌదీచమురు కేంద్రాలపై డ్రోన్‌ దాడి ఖచ్చితంగా ఇరాన్‌ చేసిందని సౌదీ ప్రభుత్వం ఆరోపించింది. అంతేకాకుండా యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌పై ఆంక్షలను పెంచమని యుఎస్‌ ట్రెజరీకి ఆదేశాలు జారీ చేశారు. వీటి ఫలితంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది.
   ‘చమురు ధరలు ప్రస్తుతానికి సమతుల్యంగా ఉన్నాయి’ అని సీఎంసీ మార్కెట్స్‌, సిడ్నీ, చీఫ్‌ మార్కెట్‌ ఎనలిస్ట్‌ మైకెల్‌ మెక్‌కర్తీ అన్నారు. సౌదీ చమురు ఉత్పత్తి సంక్షోభం తాత్కాలికమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సౌదీ చమురు ఉత్పత్తిని, డ్రోన్‌ దాడి జరగకముందు గల ఉత్పత్తితో పోల్చుకుంటే రోజుకు 34 లక్షల బారెల్స్‌ తగ్గిందని చమురు విశ్లేషణ సంస్థ కైరాస్‌ అంచనా వేసింది. విటీతో పాటు ప్రస్తుతం చమురు సరఫరా బాగానే ఉందని, అత్యవసర చమురు నిల్వలను విడుదల చేయవలసిన అవసరం లేదని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలపడం గమనార్హం. 

 



You may be interested

తగ్గిన పసిడి

Thursday 19th September 2019

వడ్డీరేట్ల తగ్గింపు రానున్న నెలల్లో ఉండకపోవచ్చనే సంకేతాలతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 11.50డాలర్లు నష్టపోయి 1,504.30 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతుంది. అమెరికాలో నిన్న ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లపై వైఖరీ ప్రకటించింది. అందరి అంచనాలకు తగ్గట్లుగానే వరుసగా రెండోసారి వడ్డీరేట్లపై పావు శాతం మేర తగ్గించింది. అయితే లేబర్‌ మార్కెట్‌ బలంగా ఉన్నందున రేట్ల కోత

10750 స్థాయికి నిఫ్టీ క్రాష్‌

Thursday 19th September 2019

స్వల్ప నష్టంతో ప్రారంభమైన సూచీలు అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల దిశగా కదులుతున్నాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఆర్థిక, ఫార్మా రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు సూచీల భారీ పతనానికి కారణవుతున్నాయి. ఉదయం గం.10:10లకు సెన్సెక్స్‌ 290 పాయింట్ల నష్టంతో 36,277 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లను కోల్పోయి 10,755.75 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 316 పాయింట్లు(1.16శాతం) నష్టపోయి 26,856.40

Most from this category