News


తగ్గిన చమురు ధర

Thursday 4th July 2019
Markets_main1562213809.png-26778

అమెరికా చమురు నిల్వలు విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా పడిపోవడంతో అధిక సరఫరా కారణాన చమురు ధరలు గురువారం(జులై 4) స్వల్పంగా నష్టపోయి ట్రేడవుతున్నాయి. గత వారం అమెరికా నిల్వలు 30 లక్షల బ్యారెల్‌ల ఉత్పత్తి పడిపోతుందని అంచనా వేయగా అది 11లక్షల బ్యారల్‌ మాత్రమే ఉందని ఎనర్జీ ఇన్ఫ్‌ర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. బెంచ్‌మార్కు బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.4 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.60డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.3శాతం నష్టపోయి బ్యారెల్‌కు 57.18డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. మంగళవారం 4శాతం మేర నష్టపోయిన విషయం తెలిసిందే. బుధవారం బ్రెంట్‌ క్రూడ్‌ 2.3శాతం, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 1.9 శాతం లాభపడ్డాయి. ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాల ఉత్పత్తి కోత కాలపరిమితిని పొడిగించడంతో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. 
 



You may be interested

31,500పైన బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 4th July 2019

బ్యాంకు నిప్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో అరశాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ 31,471.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుడంతో ఈ ఇండెక్స్‌ 0.63శాతం (200 పాయింట్లు) లాభపడి 31582.50 స్థాయి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(31,382.30)తో పోలిస్తే 0.58శాతం లాభంతో 31,564.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 4th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  మహారాష్ట్ర స్కూటర్స్‌:- కంపెనీ ఛైర్మన్‌ పదవికి మధుర్‌ బజాజ్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సంజీవ్‌ ఎన్నికయ్యారు.  మైండ్‌ ట్రీ:- కంపెనీలో 60.06 శాతం వాటాతో ఎల్ అండ్ టి కంపెనీ ప్రమోటర్‌గా వర్గీకరించబడింది. వేదాంత:- ఇండియాలో 10 ఎక్సప్లోరేషన్‌ బ్లాక్‌లను దక్కించుకుంది  కేఈపీ గ్లోబల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రోడ్యూసర్‌ కేటగరిలో కంపెనీ సామర్థ్యాన్ని అదనంగా 8.827 మెగా వాట్లకు పెంచుకుంది. తద్వారా కంపెనీ

Most from this category