News


స్వల్పంగా తగ్గిన చమురు

Tuesday 23rd July 2019
Markets_main1563854729.png-27240

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న ఒత్తిళ్ల వలన చమురు సరఫరాకు ఆటంకం కలగకుండా అవసరమైనప్పుడు ప్రతిస్పందిస్తామని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఎజెన్సీ (ఐఈఏ) తెలపడం‍తో మంగళవారం చమురు ధరలు స్వల్పంగా తగ్గి ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ చమురు డిమాండ్‌ భయాలు కూడా మదుపర్లను వెంటాడుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 2 సెంట్లు తగ్గి బ్యారెల్‌కు 63.24 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ బ్యారెల్‌కు 6 సెంట్లు తగ్గి 56.16 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. బ్రిటీష్‌ ట్యాంకర్‌ను ఇరాన్‌ రక్షక దళం స్వాధీనం చేసుకోవడంతో గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 1 శాతం పెరిగింది. ‘అంతర్జాతీయ మార్కెట్లలోకి  తగినంతగా సరఫరా కోసం అంతరాయం ఏర్పడినప్పుడు త్వరగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి ఐఈఏ సిద్ధంగా ఉంది’ అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ తెలిపారు. ‘



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 23rd July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  టీవీఎస్‌ మోటర్స్‌:- సింగపూర్‌లో తన అనుబంధ సం‍స్థ  వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా అమెరికా ఆధారిత సార్టప్‌ కంపెనీ సినాప్టిక్ సిస్టమ్స్ లో 7మిలియన్‌ డాలర్ల పెట్టుబడుతున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.  వడిలాల్‌ ఇండస్ట్రీస్‌:- కంపెనీ ఛైర్మన్‌ పదవికి రాజేష్‌ గాంధీ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో విజయ్‌ షా నియమితులయ్యారు.  బంధన్‌ బ్యాంక్‌:- సంజీవ్‌ నారాయణి బిజినెస్‌ హెడ్‌గా నియమితులయ్యారు.  ఆల్ఫాగో:- మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పోరేషన్‌

పాజిటివ్‌ ప్రారంభం...నిముషాల్లో నష్టాల్లోకి

Tuesday 23rd July 2019

గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో భారీగా నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు మంగళవారం పాజటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 107 పాయింట్ల లాభఃతో 38,138 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 11,372 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాలకే హెవీవెయిట్‌ షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లలో తలెత్తిన అమ్మకాల ప్రభావంతో సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్‌ 38,000 దిగువకు పడిపోగా,

Most from this category