News


డిమాండ్‌ భయాలతో తగ్గిన చమురు

Tuesday 2nd July 2019
Markets_main1562045357.png-26727

చమురు ఉత్పత్తి కోత నిర్ణయాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు ఒపెక్‌ దేశాలు పొడింగించినప్పటికి  అంతర్జాతీయంగా ఆయిల్‌ డిమాండ్‌ బలహీనపడడంతో భవిష్యత్తులో చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా మంగళవారం(జులై​2) ట్రేడింగ్‌లో చమురు ధరలు తగ్గాయి. సెప్టెంబర్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ప్యూచర్‌ ధరలు 0.2 శాతం తగ్గి బ్యారెల్‌కు 64.91 డాలర్ల వద్ద, అగష్టు డబ్యూటీఐ ప్యూచర్‌ ధరలు 0.4 శాతం తగ్గి బ్యారెల్‌కు 58.84  డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. సోమవారం బ్రెంట్‌ క్రూడ్‌, డబ్యూటీఐలు 2 డాలర్ల మేర లాభపడిన విషయం తెలిసిందే. ‘ రెండున్నర ఏళ్ల నుంచి విధిస్తున్న ఉత్పత్తి కోత తన ప్రభావాన్ని కోల్పోయింది. మార్కెట్లు ఇంకా డిమాండ్‌పై ఆందోళనగానే ఉన్నాయి’ అని  న్యూయార్క్‌లోని ఒన్డా సీనియర్‌ మార్కెట్‌ విశ్లేషకులు ఎడ్వార్డ్‌ మోయా అన్నారు. ‘ ఇప్పటికి ట్రేడ్‌ వార్‌ ముగిసినట్టుకాదు. అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దీపనలను ప్రకటించనున్నారు’ అని తెలిపారు. అమెరికా తయారిరంగ వృద్ధి తగ్గుముఖం పట్టడం క్రూడ్‌ ఆయిల్‌పై ప్రభావం చూపింది. జూన్‌ నెలలో యూరప్‌, ఆసియా దేశాల తయారిరంగం కూడా మందగించింది.  
  ‘పీఎమ్‌ఐ ప్రింట్లు బలహీనంగా ఉండడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతింది. బలహీనమైన డిమాండ్ నేపథ్యంలో అధిక సరఫరా అవుతుందని పెట్టుబడిదారులు భయపడుతున్నారు’ అని వానగార్డ్‌ మార్కెట్స్‌ బ్యాంకాక్‌ నిర్వహణ భాగస్వామి స్టీపెన్‌ ఇన్నెస్‌ అన్నారు. మార్కెట్‌ సమతూల్యతను కాపాడడానికి ఒపెక్‌ ఉత్పత్తి కోత పొడిగింపు సహాయపడతుందని తెలిపారు. రోజుకు 12 లక్షల బ్యారెల్‌లా చమురు ఉత్పత్తి తగ్గింపు కాలపరిమితిని 6 నుంచి 9 నెలల వరకు పొడిగించే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం తెలిపిన విషయం తెలిసిందే. 



You may be interested

లాభాల్లోంచి నష్టాలోకి మార్కెట్‌...

Tuesday 2nd July 2019

స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ.., తిరిగి నష్టాల్లోకి మళ్లింది. ప్రపంచమార్కెట్లో నెలకొన్న అనిశ్చితి వాతావరణం, దేశీయ ఆర్థిక వ్యవస్థలో నమోదైన బలహీన ఆర్థిక గణాంకాలు సూచీలను నష్టాల్లోకి మళ్లేందుకు కారణమయ్యాయి. నేడు నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 11,892.70వద్ద, సెన్సెక్స్‌ 126 పాయింట్ల లాభంతో 39,811.68 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి.  దేశీయంగా నిన్న పలు వాహన కంపెనీలు జూన్‌ మాసపు విక్రయ గణాంకాలను విడుదల చేశాయి. వరుసగా 3వ నెలలో

68.97 వద్ద ప్రారంభమైన రూపీ

Tuesday 2nd July 2019

డాలర్‌ మారకంలో రూపీ మంగళవారం(జులై 2) ట్రేడింగ్‌లో 2 పైసలు బలహీనపడి 68.97 వద్ద ప్రారంభమైంది. అమెరికా- చైనాల మధ్య సంధి కుదరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా గత సెషన్‌లో డాలర్‌ మారకంలో రూపీ 9 పైసలు బలపడి 68.95 వద్ద ముగిసింది. అంతర్జాతీయ సంకేతాల కంటే దేశియ కారకాలు రూపీని ప్రభావితం చేయనున్నాయి. ఈ వారంలో బడ్జెట్‌ ఉండడంతో రూపీ లో కదలికలు హెచ్చుగా ఉండే అవకాశం

Most from this category