News


బలహీన చైనా ఆర్థిక డేటా..నష్టాల్లో చమురు

Tuesday 15th October 2019
Markets_main1571113471.png-28885

చైనా ఆర్థిక డేటా సెప్టెంబర్‌ నెలకు సంబంధించి బలహీనంగా వెల్లడికావడం,  యుఎస్‌-చైనా పాక్షిక ఒప్పందం అమలుపై అనుమానాలు పెరగడంతో చమురు ధరలు మంగళవారం సెషన్‌లో కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9.36 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.76 శాతం నష్టపోయి బారెల్‌ 58.90 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.63 శాతం నష్టపోయి 53.25 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘అంతర్జాతీయంగా వాణిజ్యం మందగించడంతో పాటు యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా టారీఫ్‌లు పెంచుకోవడం వంటి కారణాల వలన సెప్టెంబర్‌ నెలలో చైనా దిగుమతులు, ఎగుమతులు అంచనాల కంటే అధికంగా పడిపోయాయి’ అని ఏఎన్‌జెడ్‌ బ్యాంక్‌ విశ్లేషకులు ఓ నివేదికలో తెలిపారు.  యుఎస్‌-చైనా మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం అమలుపై అనుమానాలు పెరగడం కూడా ఆయిల్‌ మార్కెట్‌లో సెంటిమంట్‌ను బలహీనపరుస్తోందని అన్నారు. దీర్ఘకాలంగా  కొనసాగుతున్న యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఆయిల్‌ డిమాండ్‌ తగ్గిన విషయం తెలిసిందే. చైనా ఎగుమతులు సెప్టెంబర్‌ నెలలో తగ్గాయి. అదే విధంగా దిగుమతులు వరుసగా ఐదవ నెలలో కూడా పడిపోయాయి. ఇది చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని తెలుపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీని ప్రభావం వలన మధ్యప్రాచ్య ఒత్తిళ్ల వలన ఏర్పడిన మద్దతు స్థాయిలను కూడా క్రూడ్‌ ఆయిల్‌ కోల్పోవలసి వస్తుందని తెలిపారు. వీటితోపాటు యుఎస్‌ ట్రంప్‌ ప్రభుత్వం టర్కీపై సోమవారం ఆంక్షలను విధించింది. నాటో బలగాలు ఈశాన్య సిరియాలో సైనిక చొరబాట్లను ఆపాలని డిమాండ్‌ చేసింది. ఈ అంశం కూడా చమురుపై ప్రభావం చూపుతోంది. You may be interested

పీఎంసీ బ్యాంకులో రూ.40,000కు ఉపసంహరణ పరిమితి

Tuesday 15th October 2019

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) ఖాతాదారులు, డిపాజిట్‌ దారులకు మరింత ఊరట లభించింది. ఒక్కో ఖాతా నుంచి గరిష్ట ఉపసంహరణ పరిమితి ప్రస్తుతం రూ.25,000 ఉండగా, దీన్ని రూ.40,000కు ఆర్‌బీఐ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రుణాల విషయంలో బ్యాంకు యాజమాన్యం అక్రమాలకు పాల్పడినట్టు తేలడంతో పీఎంసీ బ్యాంకుపై ఆరు నెలల పాటు ఆంక్షలను అమలు చేస్తున్నట్టు ఆర్‌బీఐ గత నెల 23న ప్రకటించిన విషయం

అదానీ గ్యాస్‌లోకి ‘టోటల్‌’

Tuesday 15th October 2019

37.4 శాతం కొనుగోలు చేసిన ఫ్రాన్స్‌ ఇంధన దిగ్గజం డీల్‌ విలువ రూ. 5,700 కోట్లు న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కి చెందిన ఇంధన రంగ దిగ్గజం టోటల్ ఎస్‌ఏ తాజాగా దేశీ దిగ్గజ సంస్థ అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ సుమారు రూ. 5,700 కోట్లు ఉండవచ్చని అంచనా. రిటైల్ స్థాయిలో వాహనాలకు గ్యాస్ విక్రయించడానికి దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 68 పట్టణాల్లో 1,500 సీఎన్‌జీ

Most from this category