News


పెరిగిన చమురు

Wednesday 26th June 2019
Markets_main1561522980.png-26574

అమెరికా- ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలకు తోడు అమెరికా ఆయిల్‌ నిల్వలు అనుకోని రీతిలో తగ్గడంతో బుధవారం (జూన్‌ 26) ట్రేడింగ్‌లో చమురు ధరలు ఒక శాతం పెరిగి ఈ నెలలో గరిష్ఠాన్ని తాకాయి.  బ్రెంట్‌ క్రూడ్‌ 1.4శాతం పెరిగి బ్యారెల్‌కు 65.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే 31 తర్వాత చమురుకు ఇదే  గరిష్ఠ స్థాయి. గత నెల మే 31న బ్రెంట్‌ ​క్రూడ్‌ బ్యారెల్‌కు 66.00 డాలర్లను నమోదు చేసింది. అదే విధంగా అమెరికా క్రూడ్‌ 2శాతం లాభపడి 58.97 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మే 30 (బ్యారెల్‌కు 59.03 డాలర్లు) తర్వాత డబ్యూటీఐ క్రూడ్‌ కి ఇదే గరిష్ఠ స్థాయి. గత వారం అమెరికా నిల్వలు 25 లక్షల బ్యారెల్‌లు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తే అది 75 లక్షల బ్యారెల్‌ తగ్గి జూన్‌ 21 నాటికి 4,745 లక్షల బ్యారెలకు చేరుకుంది. 



You may be interested

సీపీలను చెల్లించలేక నష్టపోయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Wednesday 26th June 2019

కమర్షియల్‌ పేపర్స్‌(సీపీ) తిరిగి చెల్లింపులో జాప్యం చేయడంతో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) బుధవారం(జూన్‌26) ట్రేడింగ్‌ ప్రారంభంలో 9 శాతం నష్టపోయింది. రూ.375 కోట్ల సీపీ చెల్లింపులను చేస్తానని మాటయిచ్చి మంగళవారం 40 శాతం మాత్రమే తిరిగి చెల్లించింది. మిగిలిన నగదును రెండు రోజుల్లో తీరుస్తామని కంపెనీ తెలిపింది.  అమ్మిన ఆస్తికి సంబంధించిన నగదు సమయానికి చేతికందలేదని కంపెనీ వివరించింది. ‘ మేం చెల్లించవలసిన రూ.375 కోట్లలో 40 శాతం చెల్లించాం. మిగిలిన

బంగారం....6ఏళ్ల గరిష్టం నుంచి వెనక్కి

Wednesday 26th June 2019

డాలర్‌ ఇండెక్స్‌ బలపడటంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర బుధవారం 6ఏళ్ల గరిష్టం నుంచి వెనక్కి వచ్చింది. ఆసియా ట్రేడింగ్‌ ఔన్స్‌ పసిడి ధర 9డాలర్లు నష్టపోయి 1,409.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ నిన్న న్యూయార్క్‌ మాట్లాడుతూ కొంతకాలం పాటు కీలక వడ్డీరేట్లపై రాజకీయ ఒత్తిళ్లను పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపారు. పావెల్‌ వ్యాఖ్యలతో ఆ దేశాధ్యక్షుడు ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్న వడ్డరేట్ల కోత విధింపుపై

Most from this category