News


పతనం తర్వాత కోలుకుంటున్న చమురు

Monday 30th September 2019
Markets_main1569818463.png-28619

గత సెషన్‌లో రెండువారాల కనిష్ఠానికి పడిపోయిన చమురు ధరలు తిరిగి సోమవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. అయినప్పటికి అంతర్జాతీయ పరిణామాల వలన చమురు లాభాలు పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం 9.51 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.18 శాతం లాభపడి బారెల్‌ 61.15 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.14 శాతం లాభపడి 55.99 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా బ్రెంట్‌ క్రూడ్‌ శుక్రవారం సెషన్లో 1.3 శాతం పడిపోయి బారెల్‌ 60.76 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.9 శాతం పడిపోయి బారెల్‌ 54.75 డాలర్లకు పడిపోయింది
  ఇరాన్‌ను నిలువరించడానికి ప్రపంచదేశాలు కలిసి రాకపోతే చమురు ధరలు ఊహించలేనంతగా పెరుగుతాయని ఆదివారం సౌదీ యువరాజు ఓ ఇంటర్యూలో అన్నారు. అంతేకాకుండా ఇరాన్‌తో రాజకీయ పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. దీంతోపాటు యెమెన్ హౌతీ ఉద్యమకారులు శనివారం దక్షిణ సౌదీ ప్రాంతమైన నజ్రాన్ సరిహద్దు సమీపంలో దాడి చేసి అనేక మంది సైనికులను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీటిపై సౌదీ అరేబియా అధికారుల నుంచి ఎటువంటి జవాబు రాలేదు. ఈ అంశాలు మధ్యప్రాచ్య ఒత్తిళ్లను పెంచుతున్నప్పటికి యూఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ఆందోళనాలు చమురు ధరలను వెంటాడుతున్నాయి.  ‘సౌదీ చమురు ఉత్పత్తి తిరిగి సాధరణ స్థాయికి రావడంతో చమురు మార్కెట్‌లో ఇన్వెస్టర్ల దృష్ఠి యూఎస్‌-చైనా వాణిజ్య యుద్ధంపై మరలింది. అంతేకాకుండా చైనా కంపెనీలలోకి యూఎస్‌ పెట్టుబడులు వెళ్లకుండా ఉండేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండడంతో ఇరుదేశాల మధ్య ట్రేడ్‌వార్‌ తీవ్రతరమవుతోంది’ అని ఎస్‌పీఐ అసెట్‌ మానేజ్‌మెంట్‌, స్టీఫెన్‌ ఇన్నెస్‌ అన్నారు. యూఎస్‌ స్టాక్‌ఎక్సేంజ్‌ల నుంచి చైనా కంపెనీలను డీలిస్టింగ్‌ చేసేందుకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పరిశీలకులు తెలిపారు. 



You may be interested

యస్‌బ్యాంక్‌ 13శాతం క్రాష్‌..!

Monday 30th September 2019

ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ యస్‌బ్యాంక్‌ షేర్లు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 13శాతం నష్టాన్ని చవిచూశాయి. నేడు ఎస్‌ఈలో ఈ బ్యాంక్‌ షేర్లు రూ.48.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంలో భాగంగా ఈ బ్యాంకు షేర్లు కూడా తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 13శాతం నష్టపోయి రూ.42.40 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.10:10లకు షేర్లు క్రితం ముగింపు(రూ.48.75)తో

కుప్పకూలిన బ్యాంక్‌ నిఫ్టీ

Monday 30th September 2019

654 పాయింట్లు నష్టపోయిన ఇండెక్స్‌ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ఉదయం ట్రేడింగ్‌లోనే 2శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 29,674.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఇండెక్స్‌ 2.20శాతం(654 పాయింట్లు) నష్టపోయి 29222.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది.

Most from this category