News


పెరిగిన చమురు

Monday 1st July 2019
Markets_main1561955481.png-26698

రష్యా, సౌది అరేబియా, ఇరాక్‌ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గింపు కాలపరిమితిని పొడింగించాడానికి సుముఖత చూపడంతో ఆయిల్‌ ధరలు సోమవారం ట్రేడింగ్‌లో పెరిగాయి. సెప్టెంబర్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ప్యూచర్‌ ధరలు 1.12 శాతం పెరిగి బ్యారెల్‌కు 65.86 డాలర్ల వద్ద, అగష్టు డబ్యూటీఐ ప్యూచర్‌ ధరలు 1.10 శాతం పెరిగి బ్యారెల్‌కు 59.57 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. చమురు ఉత్పత్తి తగ్గిం‍పు ఇంకో 9 నెలలు పొడిగించే అవకాశం ఉందని సౌది ఇందన శాఖ మంత్రి ఖలిద్‌ ఆల్‌ పహిల్‌ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, అనూహ్యంగా పెరిగిన అమెరికా చమురు నిల్వల వలన గత కొంత కాలంగా క్రూడ్‌ ఆయిల్‌కు డిమాండ్‌ తగ్గింది. చమురు ధరలను స్థిరికరించేందుకు 2017 నుంచి ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తి తగ్గింపును కొనసాగిస్తున్నాయి. రోజుకు 12 లక్షల బ్యారెల్‌లా చమురు ఉత్పత్తి తగ్గింపు కాలపరిమితిని 6 నుంచి 9 నెలల వరకు పొడిగించే అవకాశం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శనివారం తెలిపారు. దీంతో పాటు ఒపెక్‌, నాన్‌ ఒపెక్‌ దేశాలు జులై 1-2 న వియన్నాలో సమావేశమవుతుండడంతో వీటిపై ఇన్వెస్టర్లు దృష్ఠిపెట్టే అవకాశం ఉంది. 



You may be interested

1400డాలర్ల దిగువకు పసిడి

Monday 1st July 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 1400డాలర్ల దిగువకు పతనమైంది. చైనాతో జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలమయ్యే దిశగా సాగుతున్నట్లు ట్రంప్‌ శనివారం ప్రకటించడం, ఆరుప్రధాన కరెన్సీ విలువల్లో నేడు డాలర్‌ ఇండెక్స్‌ బలపడటం ఇందుకు కారణమయ్యాయి. ఫలితంగా ఆసియా ట్రేడింగ్‌ నేటి ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర ఏకంగా 26డాలర్లు వరకు నష్టపోయి 1,387.50డాలర్ల స్థాయి వద్ద పతనమయ్యాయి. ఇది పసిడి ధర వారంరోజుల కనిష్టస్థాయి కాడం గమనార్హం. జపాన్‌లోని

68.90 వద్ద రూపీ ప్రారంభం

Monday 1st July 2019

డాలర్‌ మారకంలో రూపీ సోమవారం(జూన్‌ 28) ట్రేడింగ్‌లో 12 పైసలు బలపడి 68.90 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూపీ  69.02 వద్ద ముగిసింది. జీ20 సమ్మీట్‌ ఫలితాలకై మదుపర్లు వేచి ఉండడంతో పాటు రెండు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థల మధ్య సంధీ కుదరడంతో రూపీ సానుకూలంగా ట్రేడవుతోంది. అమెరికా-చైనా సమావేశం తర్వాత ఆసియా మార్కెట్లు డాలర్‌ మారకంలో బలపడ్డాయి.  గత వారంలో రూపీ 55 పైసలు బలపడిన విషయం​తెలిసిందే.

Most from this category