News


బ్రిటన్‌ ట్యాంకర్‌ స్వాధీనం..పెరిగిన చమురు

Monday 22nd July 2019
Markets_main1563768405.png-27211

గత వారం చివర్లో ఇరాన్ మిలటరీ, బ్రిటిష్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో  చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్‌  51 సెంట్లు లేదా 0.8 శాతం పెరిగి బ్యారెల్కు 62.98 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.3 శాతం లేదా 15 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు 55.78 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత వారం బ్రెంట్‌ క్రూడ్‌ 6 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 7 శాతం మేర పడిపోయిన విషయం గమనర్హం.

   ‘పెర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు ఎక్కువగా ఉండటంతో చమురు ధరలకు మద్ధతు లభిస్తోంది. కానీ అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ తగ్గడంతో పాటు, అమెరికా చమురు నిల్వలు పెరగడంతో చమురు బేరిష్‌గా ఉంది. ’ అని న్యూయార్క్‌లోని  ఓండా  సీనియర్ మార్కెట్ విశ్లేషకులు ఎడ్వర్డ్ మోయా తెలిపారు. ఈ నెల ప్రారంభంలో బ్రిటన్ ఒక ఇరానియన్ నౌకను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. గల్ఫ్‌లో బ్రిటిష్-జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. ఈ సంక్షోభంపై చర్చించడానికి సోమవారం ఉదయం బ్రిటన్ అత్యవసర ప్రతిస్పందన కమిటీ సమావేశం జరగనుందని ప్రధాని థెరిసా మే కార్యాలయం తెలిపింది. దీంతోపాటు తన నౌకలకు చాలా దగ్గరగా ఎగురుతున్న ఇరానియన్ డ్రోన్లను అమెరికా నాశనం చేస్తుందని యునైటెడ్ స్టేట్స్ పరిపాలన సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం చెప్పారు.  ఇరాన్ డ్రోన్‌ను హార్ముజ్ జలసంధిలో ‘నాశనం’ చేశామని అమెరికా ప్రకటించగా ఇరాన్‌ను దీనిని ఖండించింది.  

  డిమాండ్ మందగించడం, అంతర్జాతీయ చమురు మార్కెట్లలో అవాంతరాలు ఉండడం వలన చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనావేయడం లేదని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఇఎ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ శుక్రవారం  అన్నారు.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించడం వల్ల ఐఈఏ తన 2019 చమురు డిమాండ్ వృద్ధి అంచనాలను 12 లక్షల  బిపిడి నుంచి 11 లక్షల బిపిడికు తగ్గించనుందని బిరోల్ వివరించారు. 



You may be interested

రిలయన్స్‌ పాజిటివ్‌.... హెచ్‌డీఎఫ్‌సీ నెగిటివ్‌

Monday 22nd July 2019

గతవారం చివర్లో క్యూ1 ఫలితాలను ప్రకటించిన హెవీవెయిటేజీ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో మిశ్రమంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను నమోదుచేయడం‍తో రిలయన్స్‌ షేర్లు  0.65శాతం లాభంతో రూ. 1256.95 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలో ఈ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 1.35శాతం ర్యాలీ చేసి రూ.1265.80 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.9:30ని.లకు

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 22nd July 2019

ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, హెవీవెయిట్‌ షేర్లు క్షీణతతో మొదలుకావడంతో సోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 38, 200  పాయింట్ల సమీపంలో ప్రారంభమై, కొద్ది క్షణాల్లో 38,050 పాయింట్ల సమీపానికి పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 11,392 పాయింట్ల వద్ద ప్రారంభమై, క్షణాల్లో 11,360 పాయింట్ల స్థాయికి పడిపోయింది. గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత ఫలితాలు ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్వల్పలాభంతో

Most from this category