News


భారీ పతనం తర్వాత పెరిగిన చమురు

Thursday 8th August 2019
Markets_main1565237535.png-27619

డాలర్‌ బలహీనపడడంతో చమురు ధరలు భారీ పతనం తర్వాత గురువారం కొలుకున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 2.29 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.52 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 2.54 శాతం పెరిగి బ్యారెల్‌కు 52.39 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా యుఎస్‌-చైనా ట్రేడవార్‌ వలన చమురు డిమాండ్‌ భయాలు మదుపర్లను ఇంకా వెంటాడుతున్నాయి. ఫలితంగా గత సెషన్లో చమురు ధరలు 4 శాతం మేర పడిపోయాయి. ‘యుఎస్‌ డాలర్‌ బలహీనత క్రూడ్‌ ఆయిల్‌పై ఉన్న ఒత్తిడిని కొంత తగ్గించింది’ అని టొరంటోకు చెందిన ఓండా సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు అల్ఫోన్సో ఎస్పార్జా అన్నారు. చమురు ధరలకు మద్ధతుగా సౌదీ అరేబియా, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు(ఒపెక్‌) తీసుకుంటున్న చర్యలు కూడా క్రూడ్‌ ఆయిల్‌కు మద్ధతుగా ఉన్నాయి. కాగా చమురు ధరల పతనాన్ని అపేందుకు సౌదీ అరేబియా, ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో చర్చిస్తుందని బ్లూమ్‌బర్గ్‌ బుధవారం ఓ నివేదికలో తెలిపింది. ‘వాణిజ్య యుద్ధ ప్రభావం వలన చమురు మార్కెట్లు ఇంకా పతనమయ్యే అవకాశం ఉంది. కానీ సౌదీ అరేబియా నుండి వచ్చిన వ్యాఖ్యలు ధరలను స్థిరీకరించడానికి సహాయపడవచ్చు’ అని ఎస్పార్జా చెప్పారు.
 



You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 8th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు భాష్‌:- అనవసరమైన నిల్వలను తొలగించేందుకు రెండు యూనిట్లలో 13రోజుల పాటు ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది మారుతి సుజుకీ ఇండియా:- వరుసగా ఆరోనెలలో ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఈ జూలైలో మొత్తం 1.33లక్షల యూనిట్లను ఉత్పత్తులు చేసింది. గతేడాది ఇదే జూలైలో జరిగిన 1.75లక్షల ఉత్పత్తులతో పోలిస్తే ఇది 25శాతం తక్కువ. వ్యయ నియంత్రణలో ఉత్పత్తులను తగ్గించుకున్నట్లు కంపెనీ తెలిపింది. గుజరాత్‌ అల్కేస్‌:- భారీ

హెచ్చుతగ్గుల ప్రారంభం

Thursday 8th August 2019

తీవ్ర ఒడుదుడుకుల మధ్య గురువారంనాటి ట్రేడింగ్‌ ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 117 పాయింట్ల లాభఃతో 36,808 పాయింట్ల వద్ద మొదలైన కొద్ది నిముషాల్లోనే లాభాలన్నింటినీ కోల్పోయింది. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 10,900 పాయింట్ల వద్ద మొదలైన తర్వాత 10,855 పాయింట్ల వద్దకు పడిపోయింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో భారతి ఎయిర్‌టెల్‌, హీరో మోటో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌ షేర్లు 1-2 శాతం మధ్య పెరగ్గా,

Most from this category